యాంకర్ రష్మీకీ నిజంగా పెళ్లి కుదిరిందా.. ఆ వార్త చెప్పిన యాంకర్ పై నెటిజన్స్ ఫైర్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ పలు సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రేష్మి గౌతమ్ పెళ్లికి సంబంధించి ఇప్పటికీ ఎన్నో రకాలుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి రష్మీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ఎపిసోడ్ వదిలారు.వచ్చే ఆదివారం అనగా జూలై 24వ తేదీన ప్రసారం కానున్న ఆ ఎపిసోడ్లో అక్క బావ ఎక్కడ అన్న టైటిల్ తో ఈవెంట్ మొదలుపెట్టారు.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలో రష్మి గౌతమ్ ఇన్ని రోజులు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈరోజు చెప్పబోతున్నాను అంటూ సిగ్గుతో నాకు పెళ్లి కుదిరింది అని తెలిపింది రష్మీ.ఇక పెళ్లి కుదిరింది అని చెబుతూనే సిగ్గుపడుతూ మెలికలు తిరిగింది.

Advertisement

ఇంతలోనే ఆర్టిస్టులు అందరూ వచ్చి రష్మిని మరింత ఆట పట్టించడం మొదలుపెట్టారు.కాగా అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవ్వడంతో.

నెటిజెన్స్ షో నిర్వాహకులపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.రష్మీ కి నిజంగానే పెళ్లి ఫిక్స్ అయ్యిందా లేకపోతే ఎపిసోడ్స్ కోసమా, లేదంటే స్క్రిప్ట్ లో భాగంగా చెప్పిస్తున్నారా అన్న విషయం అన్న విషయం పక్కన పెడితే యూట్యూబ్ లో వీడియో కింద కామెంట్ లతో నెటిజన్స్ రెచ్చిపోతున్నారు.

ఇప్పటికే ఇలాంటి వార్తలు ఎన్నో చూసినాము.ఇంకా ఎన్నాళ్లు బకరాలను చేస్తారు.ప్రోమోల కోసం ఇలా డైలాగులు చెప్పిస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఒకవేళ రష్మీ గౌతమ్ నిజంగానే తన పెళ్లి అని చెప్పిన కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు.ఇదంతా కూడా షో టిఆర్పి రేటింగ్స్ కోసం మాత్రమే ఇలా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

రష్మీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.

Advertisement

తాజా వార్తలు