19ఏళ్ల యువతిపై తాత, మేనమామలు కలిసి...

తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.అంతేగాక ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ వావివరుసలు మరచి ప్రవర్తిస్తారు.

తాజాగా ఓ యువతి తన అనుకున్న వాళ్ల చేతిలోనే దారుణ అత్యాచారానికి గురైన ఘటన హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ ప్రాంతంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే స్థానిక బండ్ల గూడ ప్రాంతంలో ఓ యువతి తన అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే నివాసం ఉంటోంది.

అయితే వ్యక్తిగత కారణాల వల్ల గత కొద్దికాలంగా ఆమె తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటోంది.ఈ క్రమంలో ఆ యువతి తాత ఆమెపై కన్నేశాడు.

అంతేగాక ఆమెతో ఎలాగైనా లైంగిక వాంఛ తీర్చుకోవాలని యువతిపై పలుమార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు.ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Advertisement

భయంతో ఆ యువతీ తనపై అఘాయిత్య విషయాన్నితన తల్లితో చెప్పుకుంది.

ఈ విషయం తెలుసుకున్నబాధితురాలి తల్లి ఖంగు తింది.వెంటనే బాధితురాలు వెంటబెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తండ్రిపై ఫిర్యాదు నమోదు చేసింది.అయితే పోలీస్ స్టేషన్ లో బాధితురాలు తన మేనమామ కూడా అప్పుడప్పుడు తనపై అత్యాచారం చేశాడని చెప్పుకుంటూ బోరున విలపించింది.

దీంతో పోలీసులు అయితే మేనమామ మరియు తాతయ్యల పై కేసు నమోదు చేశారు.దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్టు చేసి విచారణ నిమిత్తమై రిమాండుకు తరలించారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు