దర్జా రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ సలీం మాలిక్ దర్శకత్వంలో రూపొందిన సినిమా దర్జా.

ఇందులో సునీల్, అనసూయ భరద్వాజ్, షఫీ, ఆమని, పృథ్వీ, అక్సా ఖాన్, షమ్ము, షకలక శంకర్, మిర్చి హేమంత్, చత్రపతి శేఖర్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, తదితరులు నటించారు.

ఇక ఈ సినిమాకి ర్యాప్ రాక్ షకీల్ సంగీతాన్ని అందించాడు.ఇక శివశంకర్ పైడిపాటి నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.

ఇదిలా ఉంటే మరోసారి అనసూయ, సునీల్ కాంబినేషన్లో సినిమా రావటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత దృష్టి పెట్టారు.ముఖ్యంగా అనసూయ కాబట్టి తనకోసం, తన పాత్ర కోసం ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు బాగా ఎదురు చూడగా మొత్తానికి ఈ సినిమా థియేటర్లో ఈరోజు విడుదల అయింది.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

Advertisement

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో అనసూయ కనకం అలియాస్ కనకమహాలక్ష్మి అనే పాత్రలో నటించింది.ఇక కనకం అంటే బందర్లో అందరికీ హడల్ పుట్టిస్తుంది.

ఇక తన మాటలను వినకపోతే పోలీసులను కూడా చంపేస్తుంది.ఇక తన సహాయంతో ఎమ్మెల్యే అయిన ఓ వ్యక్తి తనకు ఎదురు తిరిగితే ఆయన కూతురును తన తమ్ముడితో రేప్ చేయించి చంపేస్తుంది.

ఇక ఈమెకు సముద్రంపై కూడా పట్టు సాధించాలని ఉండటంతో.బందర్ పోర్టు కాంట్రాక్టు సొంతం చేసుకోవాలనుకుంటుంది.

ఈ సమయంలో తనకు ఏసీపీ శివ శంకర్ (సునీల్) ఎదురుపడతాడు.ఇక కనకంను, ఆమె తమ్ముని చంపాలని రంగ అనే వ్యక్తి తిరుగుతాడు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇంతకు ఆ వ్యక్తి ఎవరు.వారిని ఎందుకు చంపాలనుకుంటాడు.

Advertisement

కనకం అన్న మూగవాడైనా గణేష్, తీన్మార్ గీత, పుష్పలు ఎవరు.ఇక కనకం చేసే అరాచకలను ఏసీపీ శివశంకర్ అడ్డుకుంటారా లేదా.

చివరికి కనకం ఏమవుతుంది అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

నటినటుల నటన:

ఇందులో సునీల్ పాత్ర బాగా హైలైట్ గా నిలిచింది.పోలీస్ గా న్యాయం చేశాడు సునీల్.ఇక అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆమె తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక మిగతా నటీనటులు అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా రొటీన్ కథగా ఉన్నా కూడా దర్శకుడు ఈ కథను మరింత అద్భుతంగా చూపించడానికి ప్రయత్నించాడు.సంగీతం పరవాలేదు అన్నట్లుగా ఉంది.

మిగతా టెక్నీషియన్లు కూడా తమ పూర్తి బాధ్యతలు చేపట్టాయి.

విశ్లేషణ:

ఇక ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది.సినిమా ఎంట్రీ లోనే అనసూయ ఎంట్రీ ఇస్తుంది.

ఆ తర్వాత మధ్య మధ్యలోనే తన పాత్ర అది చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.ఇక ఈ అనసూయ పాత్రతోనే దర్శకుడు ప్రేక్షకులతో ఒక ఆట ఆడుకున్నట్లు కనిపిస్తుంది.ఇక సునీల్ సెకండ్ ఆఫ్ లో ఎక్కువగా కనిపిస్తాడు.

ఇందులో అనసూయ పాత్ర ఇదివరకే చూసినట్లు అనిపించినా కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ప్లస్ పాయింట్స్:

అనసూయ, సునీల్ పాత్రలు.స్టోరీ పరవాలేదు.

మైనస్ పాయింట్స్:

సంగీతంలో కాస్త మార్పులు ఉంటే బాగుండేది.కాస్త స్లోగా అనిపించింది.

బాటమ్ లైన్:

ఇక ఈ సినిమా సునీల్, అనసూయ కోసం, వారి పాత్రల కోసం చూడవచ్చు.

రేటింగ్: 3/5

తాజా వార్తలు