టీడీపీ పరిస్థితి చూస్తుంటే బయటి పోరు కంటే కూడా ఇంటిపోరే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.ఇప్పటికే ఎన్నో అడ్డంకులు సవాళ్లతో నానా ఇబ్బందులు పడుతున్న పార్టీని సీనియర్లు మరింత ఇబ్బందుల్లో పెడుతున్నారు.
ఇప్పటికే ఒకరి మీద మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారు.ఇక ఇలాంటి తరుణంలో ఇప్పుడు మళ్లీ అనంతపురం జిల్లాలో కలకలం రేపుతోంది.
ఇప్పటికే ఇక్కడ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.ఇప్పటికే ఓవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి నేతల తీరుపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు.
ఆయన వ్యవహారం ముగియక ముందే మరోవైపు ఈ జిల్లాకు చెందిన కొందరి తీరు కలకలం రేపుతోంది.ఇక అనంతపురంలో రీసెంట్ గా టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యవహారం తెలుగు తమ్ముళ్లకు కోపం తెప్పిస్తోంది.
ఏకంగా ఆయన తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డితో టిఫిన్ చేయడం ఆయనతో చాలా క్లోజ్‌గా భేటీలో మాట్లాడుకోవడం ఇప్పుడు పెను సంచలనంరేపింది.ఇక వీరిద్దరూ కలిసి ఇలా టిఫిన్ చేయడంకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం టీడీపీకి చిక్కులు తెచ్చిపెడుతోంది.

దీంతో ఆయన తీరుపై టీడీపీ తమ్ముళ్లు కోప్పడుతున్నారు.ఇప్పటికే పార్టీ చిక్కుల్లో ఉందంటే మీరు మరింత నాశనం చేస్తున్నారంటూ ఆయనపై దుమ్మెత్త్తిపోస్తున్నారు.ఇంకా కొందరు అయిన ఆయనపై నేరుగానే ప్రశ్నలు సంధిస్తున్నారు.ఆయన తన భూములను కాపాడుకోవడం కోసమే ఇలా వైసీపీ ఎమ్మెల్యేతో భేటీ అయ్యారంటూ భగ్గుమంటున్నారు.ఇక చాలామంది అయితే ఆయన తీరుపై ఫైర్ అవుతున్నారు.చంద్రబాబు నాయుడు వెంటనే వారిపై యాక్షన్ తీసుకోవాలని లేకపోతే పార్టీని మరింత భ్రష్టు పట్టిస్తారని మండిపడుతున్నారు.
మరి చంద్రబాబు ఆయనపై ఎలాంటి నిర్ణయం చేస్తారో తెలియాంటే వేచి చూడాల్సిందే.