ఆనందయ్య పసరులో ఉన్న పస ఇంకా తేలలేదు.. కానీ బ్లాక్ మార్కెట్ దందా మొదలు పెట్టిన మోసగాళ్లు.. !

మోసగాళ్లకు అవకాశం వస్తే చార్మినార్‌కు ఓనర్ మా చాంద్ పాషా తాత, నిన్ననే మా పేరు మీద రిజిష్ట్రర్ చేశారు.

మీకు కావాలంటే కొనేసుకుని మంచి షాపింగ్ మాల్‌లా, లేదా పర్యాటక ప్రదేశంగా ఊపయోగించుకోవచ్చూ అంటూ పిట్టల దొర చెప్పినట్లుగా మాటలతో మాయ చేస్తారు.

అరే కృష్ణపట్నం లో ఆనందయ్య కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేస్తున్నారనే పబ్లిసిటీ ఇలా వచ్చిందో లేదో అప్పుడే నకిలీ మందు సృష్టించారట.అసలు ఈ పసరులో ఉన్న పస తెలుసుకోవడం కోసం ఆయూష్ డిపార్ట్‌మెంట్‌ కూడా రంగంలోకి దిగింది.

అది తేలే వరకు ఎవరికి ఈ మందు ఇవ్వకూడదని ఆజ్ఞలు కూడా అధికారులు జారీ చేశారు.కానీ కొందరు కేటుగాళ్లు మాత్రం ఇది ఆనంద‌య్య త‌యారు చేసిన క‌రోనా ఆయుర్వేద మందు అంటూ ఒక్కో ప్యాకెట్‌కు రూ.3 వేల నుంచి రూ.10 వేల వ‌ర‌కు తీసుకుంటు బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారట.ఇక అసలే మృత్యు భయంతో అల్లాడిపోతున్న జనం ముందు వెనకా ఆలోచించకుండా ఈ దొంగ మందును వాడితే కరోనాతో ప్రాణం పోతుందో లేదో కానీ, ఈ నకిలీ పసరు తాగి మరణిస్తే ఎంత అపవాదు వస్తుందో ఆలోచించండి.

జరిగేది ఎలాగు జరగక మానదు.అంత వరకు మీ తొందరపాటును నిద్రపుచ్చండి అని అంటున్నారట.

Advertisement
పైసా ఖర్చు లేకుండా స్కిన్ పిగ్మెంటేషన్ ను వదిలించుకోవడం ఎలాగో తెలుసా?

తాజా వార్తలు