ఏడుస్తున్న పిల్లోడిని ఓదార్చిన కుక్క.. బ్యూటిఫుల్ వీడియో వైరల్..

నిజమైన స్నేహితులు రక్తసంబంధం లేకపోయినా మన ఫ్యామిలీలో ఒకరైపోతారు.ఇది నిజమే.

రక్తసంబంధం లేనివారితో కూడా మంచి అనుబంధం ఏర్పరచుకోగలం.

ఈ స్నేహం మనుషులతోనే కాదు పెంపుడు జంతువులతో( Pet Animals ) కూడా ఏర్పడుతుంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఈ పవిత్రమైన బంధం గురించి తెలియజేస్తూ ఇటీవల ఓ బ్యూటిఫుల్ వీడియో షేర్ చేశారు.ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే( International Friendship Day ) సందర్భంగా ఆయన ఈ వీడియో పంచుకున్నారు.

ఇందులో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుండగా అతని పెంపుడు జంతువు ఓదార్చుతున్న చాలా అందమైన వీడియోను పంచుకున్నారు.

Advertisement

ఆ 39 సెకన్ల వీడియోలో ఒక చిన్న బాలుడు( Kid ) సోఫాకు ఆనుకుని కూర్చుని గుక్కపట్టి ఏడుస్తున్నాడు.చిన్న పిల్లవాడు ఇంతగా ఏడ్వడం చూస్తే ఎవరికైనా సరే చాలా బాధేస్తుంది.ఆ పిల్లోడికి కూడా అది పెద్ద విషయమే అయి ఉండాలి.

అదృష్టవశాత్తూ, ఆ బుడ్డోడికి చాలా అందమైన స్నేహితుడు ఉన్నాడు.అదే అతని పెంపుడు కుక్క,( Pet Dog ) అది ఈ పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోవడానికి ముందుగా అతని దగ్గరకు వస్తుంది.

ఆ తర్వాత అబ్బాయి ముఖం తుడవడానికి టిష్యూ తీసుకొని వచ్చి, అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది.

కొంతవరకు ఓదార్చుకున్న అబ్బాయి తన అందమైన స్నేహితుడిని చూసి కౌగిలించుకుంటాడు.ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే నాడు నిజమైన స్నేహం గురించి తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అందరూ ఈ వీడియో బ్యూటిఫుల్‌గా ఉందని కామెంట్లలో పేర్కొన్నారు.ఆ వీడియో ఆగస్టు 4న దీనికి నాలుగున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.14 వేల లైక్‌లు, 520 కామెంట్లు వచ్చాయి."నిజమైన స్నేహితులు ప్రతి కన్నీటిని పంచుకుంటారు" అని ఒక ఎక్స్ యూజర్ రాశారు.

బాలయ్యలో ఈ రెండు షేడ్స్ ఉన్నాయి..బిగ్ బాస్ దివి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
కలనా లేక నిజామా.. పాకిస్తాన్లో జగన్నాథుడి రథయాత్ర (వీడియో)..!

"స్నేహం ప్రత్యేకమైన వ్యక్తులతో మాత్రమే ఉండదు.మనం స్నేహితులుగా ఉండే వ్యక్తులే ప్రత్యేకంగా మారుతారు.

Advertisement

" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

తాజా వార్తలు