కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి పరిచయం అక్కర్లేదు.అతని మనసుకి ఏది నచ్చినా వెంటనే సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకోవడం అతని హాబీ.
తాజాగా అతను హర్ ఘర్ తిరంగా విషయమై ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.భారత స్వతంత్ర వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన సంగతి విదితమే.
ప్రధాని నరేంద్ర మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ పిలుపునివ్వడంతో దేశ వ్యాప్తంగా భారతీయులు తమ ఇళ్లు, కార్యాలయాలపై మువ్వన్నెల జెండాను అలంకరించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఒక వృద్ధ జంట కష్టపడి తమ ఇంటికి జాతీయ జెండాను కడుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను తాకింది.
అసలైన నిస్వార్థ దేశభక్తిని చాటుతున్న ఈ వృద్ధ దంపతుల చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.ఈ చిత్రంలో, ఓ బీద వృద్ద జంట, వారి రేకులింటి పైకప్పుపై జాతీయ జెండాను కడుతున్న విధానం కనిపిస్తుంది.
భార్య ఓ డ్రమ్ ఎక్కి, పైకప్పు రాడ్డుకు జెండా కడుతుంటే, భర్త ఆమెకు సహాయం చేస్తుంటాడు.

అతను సదరు ఫోటోని పోస్ట్ చేస్తూ….“స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంత గొడవ ఎందుకు అని ఎవరైనా అనుకుంటుంటే, ఈ ఇద్దరిని అడగండి.వారు చాలా ఉపన్యాసాలు ఇవ్వగలిగే దానికంటే బాగా వివరిస్తారు.
జై హింద్” అంటూ ఆనంద్ మహీంద్ర ఈ ఫోటోకు శీర్షిక ఇచ్చారు.ఇప్పుడు ఈ చిత్రం నెటిజన్లను హృదయాలను కొల్లగొట్టింది.
స్వాతంత్య్రం విలువ నిజంగా తెలిసిన వ్యక్తులు వీరే అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఒకసారి మీరు కూడా సదరు ఫోటోని తిలకించి మీమీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిజేయజేయండి.







