'బేబీ' మూవీ కలెక్షన్స్ డౌన్‌... 'బ్రో' వచ్చే వరకు ఇదే పరిస్థితి

విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబ్‌ ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya )హీరోయిన్ గా నటించిన చిత్రం బేబీ.ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించగా ఎస్ కే ఎన్ నిర్మాత.

 Anand Devarakonda Baby Movie Collections In Second Week , Vijay Deverakonda, Ana-TeluguStop.com

గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమా ను సమర్పించగా దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరించాడు.

మొత్తానికి ఈ సినిమా చిన్న సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి… చిన్న సినిమా ల్లో బాహుబలి అనిపించుకుంటుంది.దాదాపుగా 70 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా కలెక్షన్స్ మంగళ వారం నాడు కాస్త డ్రాప్ అయ్యాయి.ఓవరాల్‌ గా చూసుకుంటో అబో అన్నట్లుగానే ఉన్నాయి.

ఒకటి రెండు చోట్ల ఇంకా కూడా హౌస్ ఫుల్‌ కలెక్షన్స్ నమోదు అవుతూనే ఉన్నాయి.మరో వైపు వసూళ్లు కాస్త తగ్గాయి.

బ్రో సినిమా విడుదల అయ్యే వరకు బేబీ జోరు కంటిన్యూ అవుతూనే ఉంటుంది.ఒక వైపు వర్షాల జోరు తగ్గడం లేదు.

మరో వైపు బేబీ( Baby movie ) వసూళ్లు తగ్గడం లేదు.ఈ రేంజ్ లో వసూళ్లు వస్తాయని ఏ ఒక్కరు ఊహించలేదు.వర్షాలు ఇంతగా వస్తున్నా కూడా ఎలా జనాలు ఈ రేంజ్ లో వస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఇక బేబీ కలెక్షన్స్ ఫుల్ రన్‌ లో వంద కోట్లు గా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంతా అనుకున్నారు.

కానీ ఈ వర్షాల కారనంగా ఆ నెంబర్‌ చేరే అవకాశం లేదు.అయినా కూడా వంద కోట్లు కాదు బేబీ సినిమా రెండు వందల కోట్ల కు సమానమైన అభిమానం.

ఆధరణ దక్కించుకుంది అనడం లో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube