16 ఏళ్ల బాలిక విరామం లేకుండా ఏకధాటిగా 127 గంటలపాటు నాట్యం( 127 Hours Dance ) చేసి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది.ఆ బాలికకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన సృష్టి సుధీర్ జగ్ తాప్( Srushti Sudhir Jagtap ) లాతూర్ లోని పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది.ఈ బాలిక తల్లిదండ్రులైన సుధీర్, సంజీవని ఇద్దరూ టీచర్లే.సృష్టి సుధీర్ జగ్ తాప్ వాళ్ల తాతగారు స్వయానా నాట్య గురువు.అందుకే ఆమెకు చిన్నప్పటినుండే నాట్యం అలవాటయింది.కానీ ఆమె రికార్డ్ కోసం నాట్యం చేయాలని కోరికకు కారణం మాత్రం బందనా నేపాల్.
ఆమె 2018లో 126 గంటలసేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్( Longest Dance Marathon ) లో గిన్నిస్ రికార్డు సాధించింది.ఆమె నుంచి స్ఫూర్తి పొంది సృష్టి సుదీర్ జగ్ తాప్ సరికొత్త రికార్డు సృష్టించింది.
బందనా నేపాల్ నాట్యానికి భారతదేశంలో పలు రికార్డులు సొంతమయ్యాయి.ప్రపంచ దేశాలకు మన శాస్త్రీయ నాట్యం గురించి తెలియాలనే ఆలోచన సృష్టి సుధీర్ లో కలిగింది.ఈమె ఆలోచనకు తల్లిదండ్రులు, తాత అండగా నిలిచారు.గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడం కోసం కథక్ నాట్య సాధన చేయాలనుకుంది.
తన తాత పర్యవేక్షణలో 15 నెలల పాటు కఠోర సాధన చేసింది.ధ్యానంలో యోగ నిద్ర( Yoga Nidra ) కూడా సాధన చేసింది.
ప్రతిరోజు నాలుగు గంటలసేపు ధ్యానం, మూడు గంటలసేపు వ్యాయామం, 6 గంటలసేపు నాట్య సాధన చేసింది.
సృష్టి సుధీర్ 127 గంటల నాట్య ప్రదర్శన మే నేల 29వ తేదీన పోదార్ స్కూల్ వేదికపై మొదలైంది.నాట్య ప్రదర్శన ఐదు రోజులపాటు నిర్విరామంగా సాగింది.అయితే ఆహారం లేకపోతే శరీరం డిహైడ్రేషన్( De Hydration ) కు లోను అవుతుంది కాబట్టి గంటకు ఒకసారి ఐదు నిమిషాల సేపు విరామం తీసుకుని ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూ నాట్య దీక్షను కొనసాగించింది.
ప్రదర్శనను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్( Guinness World Records ) ప్రతినిధి స్వప్నిల్ దంగారికర్ సర్టిఫికెట్ ప్రధానం చేస్తూ సృష్టి సుధీర్ ను ప్రశంసలతో ముంచెత్తారు.