పొంగులేటి, ఈటెల సేమ్ టార్గెట్..?

కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) మరియు బీజేపీ నేత ఈటెల రాజేందర్( Etela Rajender ).ఇద్దరు కూడా బి‌ఆర్‌ఎస్ బహిష్కృత నేతలనే సంగతి తెలిసిందే.

 Ponguleti, Etela Same Target , Ponguleti Srinivas Reddy, Etela Rajender, Kcr, C-TeluguStop.com

ఈ ఇద్దరు బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వేర్వేరు పార్టీలలో చేరినప్పటికి ఒకే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.అదే కే‌సి‌ఆర్ ( KCR )ను గద్దె దించడం.

ఈసారి ఎలాగైనా కే‌సి‌ఆర్ ను గద్దె దించుతామని ఈ ఇద్దరు గట్టిగానే శపథం చేస్తున్నారు.ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత పార్టీలో సరైన ప్రదాన్యం దక్కడం లేదని.

కొన్నాళ్లు పెద్దగా యాక్టివ్ కనబరచలేదు.

Telugu Bjpcandi, Congress, Etela Rajender, Etela Target, Ponguleti, Telangana-Po

కానీ ఈ మద్యనే ఈటెలకు ఎన్నికల కమిటీ చైర్మెన్ హోదాను కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం.ఇక అప్పటి నుంచి కే‌సి‌ఆర్ టార్గెట్ గా ఈటెల గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నారు.కే‌సి‌ఆర్ ను దగ్గరి నుంచి చూసిన వ్యక్తి కావడంతో గులాబీ బాస్ వ్యూహరచనలపై ఈటెలకు మంచి పట్టు ఉంది.

అందుకే కే‌సి‌ఆర్ ను దెబ్బ తీసేందుకు ఆయన బలహీనతలపై ఎక్కువగా ఫోకస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈటెల.అటు ఈ మద్యనే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే రకమైన దొరణిలో ఉన్నారు.

ఖమ్మం జిల్లాలో తిరుగులేని ప్రజాదరణ కలిగిన పొంగులేటికి కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టే సామర్థ్యం ఉందా అంటే చెప్పలేని పరిస్థితి.

Telugu Bjpcandi, Congress, Etela Rajender, Etela Target, Ponguleti, Telangana-Po

అయినప్పటికి కే‌సి‌ఆర్ ను ఓడించడమే తన అంతిమ లక్ష్యమని పొంగులేటి బల్లగుద్ది చెబుతున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్( Congress ) తరుపున ఎన్నికల కమిటీ కొ చైర్మెన్ గా పొంగులేటి వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో అటు ఈటెల, ఇటు పొంగులేటి ఒకే లక్ష్యంతోనే కాకుండా పదవుల విషయంలో కూడా దాదాపు ఒకే స్థానంలో ఉన్నారు.

దీంతో కే‌సి‌ఆర్ ను గద్దె దించేందుకు ఈ ఇద్దరు ఒకటౌతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి కొందరిలో.పార్టీల పరంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్నప్పటికి ఒకే టార్గెట్ కావడంతో వ్యూహాల విషయంలో ఈ ఇద్దరు కలిసి అడుగులేసిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.

మరి ఈ ఇద్దరు నేతలు వారి టార్గెట్ ను ఎంతవరుకు చేధిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube