అనకొండ రైలు.. పొడవెంతో తెలిస్తే అవాక్కవుతారు..?

భారతీయ రైల్వే తాజాగా మరో సంచలన రికార్డును సృష్టించింది. 177 వాగన్ లతో కూడిన అనకొండ లాంటి రైలును పట్టాల మీద పరుగులు పెట్టించింది భారతీయ రైల్వే, ఇక రైలు పొడవు ఏకంగా 2.

8 కిలోమీటర్లు.ఇక ఈ రైలు పేరు సూపర్ అనకొండగా నామకరణం చేశారు భారత రైల్వే శాఖ అధికారులు, అయితే ఇంత భారీ రైలును పట్టాల మీద పరుగులు పెట్టించి భారత రైల్వే సరికొత్త చరిత్ర సృష్టించింది అనే చెప్పాలి.

ఇక ఈ రైలు ఒడిస్సా బిలాస్పూర్ డివిజన్లోని లజ్ కూరా - రావూర్కెల మధ్య కూత వినిపించింది.వాస్తవంగా అయితే ఈ రైలు ఒకటి కాదు మూడు రైళ్ల అమరిక .అయితే ఈ రైలుకు సంబంధించిన ఒక వీడియో ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ ఘోయల్ సోషల్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తూ చక్కర్లు కొడుతోంది.మూడు రైళ్లను ఒకదాని వెనుక ఒకటి అమర్చి.

ఒకేసారి ఏకంగా 15 వేల టన్నుల బొగ్గును రవాణా చేశారు.అయితే గతంలో ఒడిషాలో సంబల్పూర్ డివిజన్లో రెండు కిలోమీటర్ల పొడవైన అనకొండ పేరు ఉన్న రైలు పరుగులు పెట్టించి రికార్డు సృష్టించిన రైల్వే శాఖ.అంతకుముందు 7.57 మీటర్ల ఎత్తైన డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ను నడిపి చరిత్ర సృష్టించింది.ఇప్పుడు సూపర్ అనుకొండ అనే 2.8 కిలోమీటర్ల రైళ్లను నడిపిస్తూ మరో రికార్డు సృష్టించింది భారత రైల్వే శాఖ.

Advertisement
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

తాజా వార్తలు