ఇప్పటికే నాలుగు సార్లు చేశారు.. ఐదోసారి మీరే చేయండి.. పెళ్లి వార్తలపై అంజలి కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.ఈ విధంగా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తూ ఉండడం మనం చూస్తున్నాము.

 Anajali Open About Her Marriage Rumours Details, Anjali, Anjali Marriage Rumours-TeluguStop.com

అయితే నటి అంజలి( Anjali ) గురించి కూడా ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి.ఈమె ఇదివరకే పెళ్లి చేసుకుందని ప్రముఖ నటుడు ప్రేమలో ఉన్నటువంటి ఈమె తన చేతిలో మోసపోయింది అంటూ అంజలి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

ఇక ఈమె సినిమాల పరంగా కాస్త ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది( Geethanjali Malli Vachindi ) అనే సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మీడియా వారు ఈమె అడిగిన ప్రశ్నకు ఈమె స్పందిస్తూ పెళ్లి వార్తలు( Marriage Rumours ) గురించి క్లారిటీ ఇచ్చారు.

నాకు తెలియకుండా సోషల్ మీడియా ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు.ఇప్పుడు కూడా పెళ్లి చేస్తున్నారని ఈమె వెల్లడించారు.ఇలా నాకు పెళ్లయిందని వేరే ఇంట్లో ఉంటున్నట్టు వార్తలు రాశారు ఈ వార్తలు నావరకు  కూడా వచ్చాయని అంజలి తెలిపారు.

అయితే నిజం ఏంటంటే నేను ఎక్కువగా అవుట్ డోర్ షూటింగ్స్ లోనే ఉంటున్నానని ఈ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఈమెకు తెలిపారు.ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ తప్పకుండా తాను పెళ్లి చేసుకుంటానని తెలిపారు.

కానీ దానికి కాస్త సమయం ఉందని అప్పుడు తానే ఈ విషయాన్ని చెబుతానని అంజలి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube