ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లతో పాటు ఎస్పీలు నియామకం( SP ) అయ్యారు.ఈ మేరకు ఇటీవల బదిలీ అయిన ఐపీఎస్, ఐఏఎస్( IPS,IAS ) స్థానాల్లో కొత్తవారిని నియమించారు.
ఎన్నికల కమిషన్ సూచనల మేరకు బదిలీ అయిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.తాజా ఉత్తర్వుల ప్రకారం కృష్ణా జిల్లా ఎన్నికల అధికారిగా డీకే బాలాజీ నియామకం అయ్యారు.
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారిగా వి.వినోద్ కుమార్( Election Officer Vinod Kumar ), తిరుపతి జిల్లా ఎన్నికల అధికారిగా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు.అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బింధుమాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చెందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆదిఫ్ హఫీజ్ నియామకం అయ్యారు.







