ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎంతోమంది హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తెలుగులో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగులో ఎంతో మంచి అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగింటి కోడలుగా అడుగుపెట్టినటువంటి వారిలో నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) ఒకరు.
ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో లావణ్య త్రిపాటికి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించినటువంటి ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) తో కలిసి కూడా పలు సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమాల సమయంలోనే ఈమె తనతో ప్రేమలో పడటం వీరి ప్రేమ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ప్రేమలో విహరిస్తూ వచ్చారు.
ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతూ వీరిద్దరూ గత ఏడాది నవంబర్ నెలలో పెద్దల సమక్షంలో ఇటలీలో పెళ్లి బంధంతో ఒకటైన సంగతి మనకు తెలిసిందే.
ఇక మెగా ఫ్యామిలీకి ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈమె మెగా ఇంటి కోడలికి అడుగు పెట్టినప్పటికీ సినిమాలలో నటించడానికి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవని తెలుస్తోంది.ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి తన కెరియర్ పరంగా కూడా బిజీగా ఉన్నారు.
ఇక పెళ్లి తర్వాత ఈమె నటించినటువంటి మిస్ పర్ ఫెక్ట్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సిరీస్ తర్వాత లావణ్య త్రిపాఠి పలు సినీమాలకు కూడా కమిట్ అయ్యారని తెలుస్తోంది.
ఇక పెళ్లి చేసుకొని అత్తారింటికి అడుగు పెట్టినటువంటి ఈమె గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టు తరచూ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.కోటు పక్కకు జరిపి మరీ అందాలన్నింటినీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.