శిధిలమైన భవనంలో వృద్ద దంపతుల అవస్థలు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయిన ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకబిక్కుబిక్కుమంటూ వృద్ద దంపతులు కాలం వెల్లదీస్తున్నారు.వివరాల్లో కి వెళితే.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన వృద్ద దంపతులు నోముల లింగయ్య,అతని భార్య ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇంటిలో జీవిస్తున్నారు.ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థలో అండగా గత నాలుగు రోజులుగా ఎడతెరపిలేని వానలకు తడిసి కూలిపోతుంది.

గత కొంత కాలంగా లింగయ్య పక్షవాతం మంచంపట్టి లేవలేని స్థితిలో ఉన్నాడు.పాత ఇల్లు ఏ క్షణంలో కూలిపోతుందో, మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.రామన్నపేట అధికారులు, రాజకీయ నాయకులు చొరవ తీసుకుని వృద్ధ దంపతులకు తాత్కాలిక నివాసం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
ఆత్మకూర్ (ఎస్) మండలంలోని తండాల్లో నాటు సారా వాసనలు

Latest Video Uploads News