అమ్మకు క్యాన్సర్... అందరిని ఏడిపించేసిన గృహలక్ష్మి లాస్య!

తెలుగు బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోని సూపర్ క్వీన్(Super Queen) కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Amma Has Cancer Grilahakshmi Lasya Made Everyone Cry , Anchor Prashanthi, Pradee-TeluguStop.com

జీ తెలుగులో(Zee Telugu) ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఇదివరకే ఈ కార్యక్రమం ప్రసారమయ్యే ఎంతో మంచి సక్సెస్ అందుకోగా తాజగా సూపర్ క్వీన్ సీజన్ 2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిని పలువురు సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్నారు.అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా గాజువాక బస్ డిపో కండక్టర్ ఝాన్సీ, సామి సామి పాట సింగర్ మౌనిక, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లాస్య, విద్యుల్లేఖరామన్ వంటి తదితరులు హాజరైనట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే వీరంతా కూడా వారి వ్యక్తిగత విషయాల గురించి వారి తల్లుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఇక ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో లాస్య పాత్రలో నటిస్తున్న యాంకర్ ప్రశాంతి (Anchor Prashanthi) బయట ఎంతో చలాకిగా ధైర్యంగా ఉంటారు.అయితే ఈమె జీవితంలో కూడా ఓ విషాద ఘటన చోటు చేసుకుందని తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా లాస్య తన తల్లి గురించి మాట్లాడుతూ.తాను జీవితంలో ఎదగడం కోసం తన తల్లి ఎంతో కష్టపడిందని లాస్య వెల్లడించారు.తనకు తన తల్లి సపోర్ట్ చాలా ఉండేదని తెలిపారు.అయితే అమ్మకు లివర్ క్యాన్సర్(Liver Cancer) అని తెలియడంతో చాలా కృంగిపోయానని, క్యాన్సర్ తో బాధపడుతూ అమ్మ ఒకరోజు సడన్ గా చనిపోయిందంటూ తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

అయితే తల్లిని తలుచుకొని లాస్య కన్నీళ్లు పెట్టుకోగా ఆమె మాటలు విని అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు.ఇక ఈమె బాధకు ప్రదీప్(Pradeep) సైతం ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube