అమ్మకు క్యాన్సర్… అందరిని ఏడిపించేసిన గృహలక్ష్మి లాస్య!

తెలుగు బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఈ క్రమంలోని సూపర్ క్వీన్(Super Queen) కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

జీ తెలుగులో(Zee Telugu) ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇదివరకే ఈ కార్యక్రమం ప్రసారమయ్యే ఎంతో మంచి సక్సెస్ అందుకోగా తాజగా సూపర్ క్వీన్ సీజన్ 2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిని పలువురు సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్నారు.

అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. """/" / ఈ ప్రోమోలో భాగంగా గాజువాక బస్ డిపో కండక్టర్ ఝాన్సీ, సామి సామి పాట సింగర్ మౌనిక, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లాస్య, విద్యుల్లేఖరామన్ వంటి తదితరులు హాజరైనట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే వీరంతా కూడా వారి వ్యక్తిగత విషయాల గురించి వారి తల్లుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఇక ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో లాస్య పాత్రలో నటిస్తున్న యాంకర్ ప్రశాంతి (Anchor Prashanthi) బయట ఎంతో చలాకిగా ధైర్యంగా ఉంటారు.

అయితే ఈమె జీవితంలో కూడా ఓ విషాద ఘటన చోటు చేసుకుందని తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

"""/" / ఈ సందర్భంగా లాస్య తన తల్లి గురించి మాట్లాడుతూ.తాను జీవితంలో ఎదగడం కోసం తన తల్లి ఎంతో కష్టపడిందని లాస్య వెల్లడించారు.

తనకు తన తల్లి సపోర్ట్ చాలా ఉండేదని తెలిపారు.అయితే అమ్మకు లివర్ క్యాన్సర్(Liver Cancer) అని తెలియడంతో చాలా కృంగిపోయానని, క్యాన్సర్ తో బాధపడుతూ అమ్మ ఒకరోజు సడన్ గా చనిపోయిందంటూ తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

అయితే తల్లిని తలుచుకొని లాస్య కన్నీళ్లు పెట్టుకోగా ఆమె మాటలు విని అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు.

ఇక ఈమె బాధకు ప్రదీప్(Pradeep) సైతం ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచు విష్ణు కన్నప్ప సినిమా టీజర్ అలా ఉందేంటి..? వర్కౌట్ అవుతుందా..?