వైరల్: వేసవిని తట్టుకోవడానికి తలపై ఫ్యాన్.. అమితాబ్ మెచ్చిన ఐడియా గురూ!

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్( Amitab Bachhan ) గురించి ఇక్కడ ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.40 ఏళ్లకు పైగా హీరోగా , విభిన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆయన నేటికీ అలరిస్తూనే ఉన్నారు.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా రాణిస్తున్నారు.

తరచుగా తన ఫ్యాన్స్ తో బ్లాగ్స్ ఇంటరాక్ట్ అవుతారు మన బిగ్ బి.తాజాగా బిగ్ బీ అమితాబ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేసి ఆ హెల్మెట్( Helmet ) ప్రత్యేకత గురించి రాస్తూ.“ఇండియా ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్” అని క్యాప్షన్ తో అతని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

దాంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.అయితే ఈ వీడియో చాలా పాతది అయినప్పటికీ మన బిగ్ బి కళ్ళల్లో పడడంతో మరలా న్యూస్ అయింది.దీని గురించి మీరు ఇదివరకే చదివి వుంటారు.

అయినా మరొకసారి గుర్తు చేసుకుందాం.ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని గమనించినట్లయితే.

Advertisement

వేసవిలో ఎండ వేడి( Summer Heat ) నుంచి రక్షణ ఇచ్చేందుకు హెల్మెట్ లాంటి ఒక ఫ్యాన్ తలకి ధరించాడొక వ్యక్తి.ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లఖీమపూర్ జిల్లాలోని చోటుచేసుకుంది.

కాగా అతనిని అక్కడ స్థానికులు ధర్మేంద్ర బాబా అని పిలుస్తూ వుంటారు.

కాగా ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది అని స్వయంగా మన అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు.దాంతో ఈ వీడియో మరలా లైక్స్, షేర్స్ తో సోషల్ మీడియాలో దుమ్ములేపోతోంది.నెటిజన్లు అయితే దీనిని గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

భారతదేశాన్ని టెక్ గా మార్చే ఓ నూతన ఆవిష్కరణ ఇది అని కొందరు కొనియాడుతుంటే, పొదుపు కోసం తయారు చేసే రిసోర్స్‌ఫుల్ ఆవిష్కరణ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు