బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితమే.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు అమితాబ్ బచ్చన్.ఇప్పటికీ సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు అమితాబ్ బచ్చన్.
ఇది ఇలా ఉంటే అమితాబ్ బచ్చన్ ఇటీవలే విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా లెవెల్ లి విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి సక్సెస్ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది.
అలాగే మరోవైపు వికాస్ బాహ్ల్ తెరకెక్కిస్తున్న చిత్రం గుడ్‌బై సినిమాలోనూ అమితాబ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అమితాబ్ బచ్చన్ కు కూతురిగా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే అమితాబ్ బచ్చన్ ముంబైలో ఒక ఖరీదైన ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ముంబై నగరంలోని ఫోర్ బంగ్లాస్ ప్రాంతం లోని పార్థినాన్ సోసైటీ లో ఈ స్థిరాస్తిని కోనుగోలు చేసినట్లుగా సమాచారం.

బహుళ అంతస్తుల భవనంలోని 31వ ఫ్లోర్‌లో దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయం తెలుసుకున్న అపార్ట్‌మెంట్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆ ఫ్లాట్ ఖరీదెంత అన్న విషయం మాత్రం బయటికి రాలేదు.
ప్రస్తుతం బిగ్ బీ ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన జుహూలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న విషయం తెలిసిందే.