పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో రెండవ హీరోయిన్ గా నటించిన ప్రణీత సుభాష్ ని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.దాదాపు అయిదారు సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిన్నా చితక సినిమా లో నటిస్తూ ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నించిన ఈ అమ్మడు ఇటీవలే తల్లి అయిన విషయం తెలిసిందే.
చేసిన సినిమా లు తక్కువే అయినా ప్రణీత అంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులకు అభిమానం ఉంటుంది.అత్తారింటికి దారేది సినిమాలో బాపు బొమ్మ అనే పాటలో కనిపించి.
అప్పటి నుండి బాపు బొమ్మ అన్నట్లుగా ప్రణీతను తెలుగు ప్రేక్షకులు పిలుచుకునేలా చేసింది.
ఇప్పుడు ప్రణీత తల్లి అయింది, కనుక ఆమెకు ఎంతో మంది తమ వంతు అన్నట్లుగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
అమ్మగా మరింత సంతోషంగా మీరు ఉండాలంటూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.అంతా బాగుంది అనుకుంటుండగా ఒక్క సారిగా ఆమెపై ట్రోల్స్ వస్తున్నాయి.అమ్మ అయిన తర్వాత పద్ధతిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది కూడా బిడ్డను ఎత్తుకున్న సమయంలో మరింత హుందాగా వ్యవహరించాలి.

కానీ ప్రణీత మాత్రం ఇలా స్కిన్ షో చేస్తూ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది అంటూ విమర్శలు వస్తున్నాయి.బిడ్డని ఎత్తుకున్న సమయం లో షర్టు జార్చి మరి అలా స్కిన్ చూపించాల్సిన అవసరమేంటి అంటూ కొందరు ఈ ఫోటోలకు విమర్శలు చేస్తున్నారు.మరి కొందరు మాత్రం ఆమె ను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి విషయాన్ని కొందరు విమర్శిస్తూ ఉంటారా అందులో తప్పు ఉందా లేకున్నా వారి విమర్శిస్తూనే ఉంటారు.
కనుక మీరు దాని గురించి పట్టించుకోనవసరం లేదంటూ ప్రణీత సమర్థిస్తున్న వారు ఉన్నారు.ఈ విషయమై ప్రణీత ఎలా స్పందిస్తుందని చూడాలి.







