హుజురాబాద్ ' ఫలితం ' చెప్పిన అమిత్ షా ? షాకైన ' ఈటెల ' ? 

నిన్ను నే కేంద్ర బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి హుజురాబాద్ సంగతులు చెప్పారు ఈటెల రాజేందర్, బండి సంజయ్ తదితరులు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఈ బృందం తెలంగాణ రాజకీయ పరిణామాలతో పాటు , హుజురాబాద్ పరిస్థితులు తదితర అన్ని విషయాలపై చర్చించారు.

బిజెపినీ  దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు ఏ విధంగా పన్నుతోంది అనే అంశాలను అమిత్ శా ముందు ఉంచారట.అలాగే ఆగస్టు 9వ తేదీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్న విషయాన్ని , హుజూరాబాద్ లో ఆ పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేయడం తదితర అన్ని అంశాలను చర్చించారు.

అయితే తెలంగాణ బిజెపి నేతలు చెప్పిన విషయాలతో పాటు,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈటెల బృందానికి షాకింగ్ న్యూస్ చెప్పారు.అసలు హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కేంద్రం సీక్రెట్ గా సర్వే చేయించినట్లు స్వయంగా హోం మంత్రి అమిత్ షా చెప్పారట.

ఈటెల తో పాటు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటివారు ఉన్న సమయంలోనే అమిత్ షా ఈటెలకు కంగ్రాట్స్ చెప్పారట.హుజూరాబాద్ నియోజకవర్గం లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే ఈ విషయంపై తాము చేయించిన సర్వేలో బిజెపికి ఏకపక్షంగా విజయం దక్కుతుందని, రాజేందర్ పై జనాలు సానుభూతి ఉంది అని, దీంతో పాటు బిజెపి క్రేజ్ పెరిగింది అనే విషయాన్ని చెప్పారట.

Advertisement

ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని , దీనికోసం తమతో పాటు కేంద్ర మంత్రులు ఎన్ని సార్లు తెలంగాణ కి రావాలని కోరినా వస్తామని, భారీ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించినా తాము తప్పకుండా హాజరు అవుతాము అనే విషయాన్ని అమిత్ షా చెప్పారట.అమిత్ షా సమావేశం తర్వాత రాజేందర్ తో పాటు తెలంగాణ బిజెపి నేతల్లోనూ ధీమా పెరిగినట్టుగా కనిపిస్తోంద.

Advertisement

తాజా వార్తలు