అమెరికా : చెత్త బుట్టలో మృతదేహం.. 35 ఏళ్ల తర్వాత మహిళదిగా గుర్తించిన అధికారులు

పోలం దున్నుతున్నప్పుడో, భవనాలకు పునాదులు తవ్వుతున్నప్పుడో మానవ శరీర అవశేషాలు, అస్థిపంజరాలు కనిపిస్తూ వుంటాయి.అవి ఎవరివో తేల్చేందుకు పోలీసులు శ్రమిస్తూ వుంటారు.

తాజాగా అమెరికాలో( America ) చెత్త బుట్టలో దొరికిన మృతదేహం ఎవరిదో తేల్చడానికి 35 ఏళ్లు పట్టింది.వివరాల్లోకి వెళితే.35 ఏళ్ల క్రితం డంప్‌స్టర్ (చెత్తబుట్ట)లో ప్లాస్టిక్‌తో చుట్టబడిన ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.డీఎన్ఏ టెస్ట్, ఇతర పరీక్షలతో అది మహిళదని, మృతురాలు దక్షిణ కొరియాకు( South Korea ) చెందిన వ్యక్తిగా తేల్చినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు.

జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( Georgia Bureau of Investigation ) (జీబీఐ) అధికారులు.ఫిబ్రవరి 1988లో మిల్లెన్ రూరల్ ప్రాంతంలోని డంప్‌స్టర్‌లో దొరికిన మృతదేహం 26 ఏళ్ల (అప్పటికి) చోంగ్ ఉన్ కిమ్‌గా( Chong Un Kim ) గుర్తించారు.ఈ డెడ్‌బాడీ ఆనవాళ్లు తెలుసుకోవడానికి ఎంతోమంది డీఎన్ఏ సీక్వెన్స్‌లు విశ్లేషించారు.

ఆమె ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.అయితే ఆమెను ఎవరు చంపారు, మృతదేహాన్ని ఇక్కడ ఎవరు పడేశారన్నది మాత్రం నేటికీ మిస్టరీగానే వుంది.

Advertisement

ప్లాస్టిక్, డక్ట్ టేప్‌తో కిమ్‌ను చుట్టి ఓ సూట్ కేస్‌లో కుక్కీ అనంతరం డంప్‌స్టర్‌లో పడేశారు.మృతదేహాన్ని పోలీసులు ఆ ప్రాంతంలో గుర్తించడానికి నాలుగు నుంచి ఏడు రోజుల ముందు కిమ్ ( Kim )మరణించి వుండొచ్చని పరిశోధకులు తెలిపారు.

కిమ్ 1981లో అమెరికాకు వెళ్లినట్లు పరిశోధకులు, అధికారులు వెల్లడించారు.మిల్లెన్‌కు దక్షిణంగా 70 మైళ్ల దూరంలో వున్న ఫోర్ట్ స్టీవర్ట్‌ను ఆనుకుని వున్న హిన్స్ విల్లేలో ఆమె నివసించినట్లు దర్యాప్తులో తేలింది.వేలిముద్రలు, దంతాలు, ఫోరెన్సిక్ స్కెచ్‌ను ఉపయోగించినప్పటికీ పరిశోధకులు దశాబ్ధాలుగా కిమ్‌ను గుర్తించలేకపోయారు.

ఇందుకోసం ఎంతోమంది డీఎన్ఏలను నిపుణులు విశ్లేషించారు.చోంగ్ ఉన్ కిమ్ గురించి తెలిసిన వారు, కేసు గురించి ఏదైనా సమాచారం కలిగి ఉంటే 912-871-1121లో ఏజెన్సీని సంప్రదించమని జీబీఐ కోరింది.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు