అమెరికాలో ఉద్యోగాలు... కంపెనీల మొదటి ప్రాధాన్యత వారికే...అర్హతలు ఇవేనట...!!

అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే ఉద్యోగాలు చేపట్టాలని ఎంతో మంది భారతీయ విద్యార్ధులు ఉవ్విళ్ళూరుతుంటారు.

అందుకు తగ్గట్టుగానే భారతీయ విద్యార్ధుల ప్రతిభకు అక్కడి కంపెనేలు కూడా రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటాయి.

లక్షల జీతాలు ఇచ్చి మరీ మనవాళ్ళను వారి కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటాయి.అయితే ఇప్పటి వరకూ అమెరికాలో ఉద్యోగం అంటే ఏంఎస్ అర్హత తప్పకుండా ఉండాల్సిందే.

ఉన్నత ఉద్యోగం కావాలంటే తప్పకుండా ఏంఎస్ చేయాల్సిందే అలాంటి వారికే కంపెనీలు మొదటి ప్రధాన్యత ఇచ్చేవి.కానీ అమెరికాలో ఉద్యోగాల కల్పనలో ట్రెండ్ మారింది.

ఇకపై అమెరికాలో ఉద్యోగాలు అంటే ఏంఎస్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు నిపుణులు.ప్రస్తుతం బిఎస్ చేసిన విద్యార్ధులకు అమెరికాలోని పలు కంపెనీలు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి.

Advertisement

బిఎస్ చేసిన వారిని ఏరి కోరి మరీ ఉద్యోగాలలో తీసుకుంటున్నాయట, వారికి అధిక జీతాలు ఇచ్చేందుకు మక్కువ చూపుతున్నారు.బిఎస్ చేసిన వారికి సుమారు లక్ష డాలర్ల పైనే జీతం ఆఫర్ చేస్తుంటే, ఏంఎస్ చేసిన వారికి కేవలం 70 -80 వేల డాలర్లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారట.

అమెరికాలో ఏంఎస్ చేయాలంటే భారత్ లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి ఆ తరువాతే అమెరికాలో రెండేళ్ళ ఏంఎస్ చేయడానికి వీలు అవుతుంది.అయితే అమెరికాలో ఏంఎస్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, బిఎస్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అయినా సరే బిఎస్ చేసిన వారికి కంపెనీలు ఎందుకు ముందుకు వస్తున్నాయంటే అందకు కారణం లేకపోలేదు.

అమెరికాలో డిగ్రీ ప్రోగ్రామింగ్ లు ఎక్కువగా ఉంటాయి.విషయ పరిజ్ఞానం అంతా బిఎస్ స్థాయిలోనే అందిపుచ్చుకుంటారు.

అంతేకాదు తాజాగా అక్కడి విద్యా విధానంలో చేసిన మార్పుల కారణంగా డిగ్రీ పూర్తి కాగానే వారు నిష్ణాతులుగా ఓ కంపెనీని లీడ్ చేసే స్థాయికి చేరుకుంటున్నారు.ఈ నేపధ్యంలో బిఎస్ చేసిన వారికి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక ఏంఎస్ చేసిన వారికి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ప్రస్తుతం అమెరికాలో బిఎస్ చేసేవారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు