ఫిట్నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడిన స్టార్ కిడ్... అసలు విషయం చెప్పిన బ్యూటీ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమలో పడటం సర్వసాధారణం.ఇలా సెలబ్రిటీలు ఎంత త్వరగా ప్రేమలో పడుతుంటారు అంతే తొందరగా బ్రేకప్ చెప్పుకోవడం కూడా జరుగుతుంది.

అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ కిడ్ ఐరా ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ గురించి అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈమె గత రెండు సంవత్సరాల నుంచి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇలా వీరి ప్రేమ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఐరా ఖాన్ ఏ మాత్రం స్పందించలేదు.

అయితే తాజాగా తన ప్రేమ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే సైక్లింగ్‌ పోటీల కోసం ఇటీవల నుపుర్‌ విదేశాలకు వెళ్లారు పోటీ అనంతరం నుపుర్ ఐరా వద్దకు వెళ్లి తనను గట్టిగా హత్తుకుని సినిమా స్టైల్ లో మోకాలి పై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ తన వేలికి ఉంగరం తొడుగుతూ ప్రపోజ్ చేశారని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

Ameer Khan Daughter Ira Khan Revealed In Love With Fitness Trainer Nupur Details
Advertisement
Ameer Khan Daughter Ira Khan Revealed In Love With Fitness Trainer Nupur Details

ఇక ప్రియుడు అంత ప్రేమగా ప్రపోజ్ చేస్తే ఈమె కాదనలేక వెంటనే ఎస్ అని చెప్పింది.ఈ క్రమంలోనే ఐరా ఖాన్ ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ అతను ప్రపోస్ చేశాడు నేను ఎస్ అని చెప్పాను అంటూ క్యాప్షన్ పెట్టారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా నుపూర్ గత కొన్ని సంవత్సరాల నుంచి నటుడు అమీర్ ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు.ఈ క్రమంలోనే ఐరా ఖాన్ పరిచయం ఏర్పడడం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు