Aamir Khan : రాజమౌళి అవార్డు కొన్నాడు అనేవారికి గడ్డి పెట్టె న్యూస్ ఇది ..!

రాజమౌళి ఆస్కార్ అవార్డు( Rajamouli ) సాధించడానికి 80 కోట్లు ఖర్చు చేశాడు అని ఒక మనిషి అంటే లేదు అంతకంటే ఎక్కువే పెట్టాడు అని మరొకరు అంటారు.ఇలా ఎవరు ఎన్ని మాట్లాడినా ఇప్పటి వరకు ఏ భారతీయుడికి సాధ్యం కానీ ఆస్కార్ అవార్డు మాత్రం రాజమౌళికి వచ్చింది.

 Ameer Kghan Struggle To Get Oscar For Lagan-TeluguStop.com

కానీ దాని వెనక ఉన్న కష్టం దాని కోసం ప్రయత్నించి విఫలమైన వారిని అడిగితే తప్ప తెలియదు.అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ఆమీర్ ఖాన్.2002లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం లగాన్ ( Lagaan )సినిమా కోసం ఆమీర్ ఖాన్ ఆస్కార్ సంపాదించాలని తీవ్రంగా కష్టపడ్డాడు.ఒక్క మాటలో చెప్పాలంటే రెండు బిలియన్ డాలర్ల రూపాయలను వెచ్చించి మరి ఓడిపోయి తిరిగి వచ్చాడు.

Telugu Ameer Khan, Bollywood, Lagaan, Oscar, Oscar Awards, Rajamouli-Latest News

రెండు బిలియన్ డాలర్లు అంటే 20 లక్షల డాలర్లు మీరే లెక్క వేసుకోండి.రెండు దశాబ్దాల క్రితం ఇంత ఖర్చుపెట్టిన అమీర్ ఖాన్ కి అవార్డు రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ అతడు చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ ఆ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు అమీర్ ఖాన్( Aamir Khan ) ఆమీర్ ఖాన్ లెక్కల ప్రకారం సినిమాను వీలున్నంత వరకు ఎక్కువ మంది జూరీ మెంబర్స్ కి చూపించడానికి అమెరికాను లాస్ ఏంజిల్స్ కి వెళ్లారు.అలా వెళ్లి ప్రతి ఒక్కరికి చూపించాలనుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.అయినా కూడా విజయం సాదిస్తాను అనే ఒకే ఒక నమ్మకంతో ఆ పని చేశారు.ఇది తొలి దశలో ఉన్నంత వరకే ఆ తర్వాత చాలా మందికి ఇంకా సినిమాలు చూపించాల్సి ఉంటుంది మొదటి 5 లేదా 6 చిత్రాలని ఆస్కార్ అవార్డు ఎంపిక కోసం సభ్యులంతా కలిసి మరొకసారి చూస్తారు.దీనికి చాలా ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది.

అలా మొదటి ఐదు చిత్రాలలో లగాన్ పేరు కూడా ఉండడంతో అమీర్ ఖాన్ మరింత ఖర్చుకు వెనకాడ లేదు.అతని చేతిలో పవర్ఫుల్ పబ్లిసిటీ టీం కూడా ఉండింది.

ఓట్లు వేయించుకోవడం కోసం కూడా చాలా ఖర్చు పెట్టాడు అమీర్ ఖాన్.

Telugu Ameer Khan, Bollywood, Lagaan, Oscar, Oscar Awards, Rajamouli-Latest News

ఇక ఖరీదైన హోటల్లో ఒక్కో జ్యూరీ మెంబర్ కు విందులు ఇవ్వాలి.ప్రమోషన్ చేయమని అభ్యర్థించాలీ.ఖరీదైన హోటల్ లో పార్టీలు అంటే ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఉంటాడు ఆలోచించవచ్చు.

అంత చేసిన ఆస్కార్ అయితే రాలేదు ఇంత ఖర్చు పెట్టి, ఇంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఉన్న అమీర్ ఖాన్ అవార్డు తీసుకురావడానికి లేకపోవడం వెనక కారణాలు ఏంటో తెలియదు కానీ అప్పట్లో అన్ని మెయిన్ పేపర్స్ లో లగాన్ సినిమా గురించి ప్రకటనలు ఇచ్చేవాడట.కేవలం ఇలా ప్రకటన కోసమే కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడట అమీర్.

అక్కడ ఉన్న పరిస్థితుల మీద ఎలాంటి అవగాహన లేని కొందరు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.వారందరూ ఒక్కసారి ఆస్కార్ కోసం ప్రయత్నిస్తే తప్ప ఆ బాధ ఏంటో అర్థం కాదు.

ఇలా అవివేకంగా ఆస్కార్ కొన్నాడు అనే మాటలు చెప్పడం సరికాదు అని కచ్చితంగా చెప్పి తీరాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube