ఏపిలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అవడం లేదు రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది :నారా లోకేష్

మాపై పెట్టిన కేసులతో ప్రభుత్వం ఏమి పీకలేదని తేలిపోయింది.కోవిడ్ కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు ఏపిలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అవడం లేదు రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది.

55 మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించింది.పిపియి కిట్ ఇవ్వలేదని డాక్టర్ ను పిచ్చోడుని చేశారు.

నకిలీ మద్యం అమ్ముతున్నారని చెప్పినందుకు ఓం ప్రకాష్ ని కొట్టి చంపారు.ప్రజలపై ప్రభుత్వం దాడికి పూనుకుంది.

రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారు.ప్రజల వంతు అయ్యాక వైసీపీ కార్యకర్తలను కూడా చంపేస్తున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ను కొట్టి చంపి సెవాన్ని అప్పగించారు.

Advertisement

సుబ్రమణ్యం హత్య అనంతరం ఎమ్మెల్సీ పబ్లిక్ గా తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయలేదు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తున్నారు.

మూడేళ్లలో నీ సినిమా అయిపోయింది ప్రజలే రాళ్ళు వేసి చంపుతారు.ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులు సంవత్సరంలో 25శాతం పెరిగింది నాపై14 కేసులు పెట్టారు ఇంకో 10కేసులు పెట్టిన నేను భయపడను.

నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి కోర్టుకు హాజరయ్యాను.నీలాగా నేను వాయిదాలు వేసుకుంటూ తప్పించుకొని తిరగడం లేదు.

అధికారులు దొంగ కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకుంటారుదమ్ము దైర్యం ఉంటే నాపై చేసిన ఆరోపణలకు భహిరంగ చర్చకు రావాలి.హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మేల్యే చంద్ర శేకర్ రెడ్డి ద్వారా సజ్జలను కలిసారు.2 ఎకరాల భూమి,2 కోట్ల డబ్బులు ఇస్తామని సుబ్రమణ్యం కుటుంబానికి ఇస్తామని ఎమ్మేల్యే చంద్రశేకర్ రెడ్డి ఆఫర్ చేస్తున్నాడు.సుబ్రమణ్యం కేసును మాఫీ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.సజ్జలకు ఏమైనా చేతకాని వాడా, మీ ఎమ్మెల్సీని ఎందుకు అరెస్టు చేయించడం లేదు.500 మంది పోలీసులతో నా చుట్టూ తిరగడం కన్నా ముందు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయండి అంబటికి టీఎంసీ అంటే అర్ధం కూడా తెలీదు.మీ చేతకాని తనంతో పోలవరం, అమరావతి ఆపేశారు టీడీపీ అధ్వర్యంలో పరిశ్రమలు దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కౌన్సిల్ వేదికగా చెప్పిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

విశాఖట్నంలో HSBC,అధాని డేటా సెంటర్, HCl ను నిర్వీర్యం చేశారు.సీఎం జగన్ ను దావొస్ వెళ్లిమీ రాజదాని ఎక్కడా అంటే ఏమని చెప్తాడు.24 గంటల్లో సీఎం జగన్ దావోస్ వెళ్లి కలిసింది అధానిని మాత్రమే.అధానిని కలవడం కోసం దావొస్ వెళ్ళాలా డిల్లీ వెళ్తే సరిపోతుంది.

Advertisement

పిపియేలో అవినీతి జరిగిందని చెప్పారు ఇప్పుడు అదే సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.జగన్ చేస్తున్న డ్యామేజ్ వల్ల దేశం మొత్తం ఏపి గురించి మాట్లాడుకుంటుంది.

టిడిపి నేతలపై పెట్టిన కేసులకు మేము బయపడం.ఎపిని ఉడ్తా ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రగ్ డాన్ గంజాయి ఎక్కడ పట్టుబడిన మేడిన్ ఆంధ్ర ప్రదేశ్ గా మారింది.

డ్రగ్స్ రవాణాలో పంజాబ్ మాదిరిగా ఆంద్ర ప్రదేశ్ మారింది స్వాధీనం చేసుకున్న గంజాయి తగలబెడితే 24 గంటల్లో సవాంగ్ ను బదిలీ చేశారు.ఏమి సామాజిక న్యాయం చేస్తున్నారని బస్సు యాత్ర చేస్తున్నారు సీఎంఓలో ఎవరు ఉన్నారని సామాజిక న్యాయం చేశారని చెప్తున్నారు.

పొరుగు రాష్ట్రం వారికి ఎమ్మెల్సీ ఇవడం ఎంటి ఏపిలో ఎవ్వరూ లేరా.

తాజా వార్తలు