Bigg Boss7 : భార్యను చూసి కన్నీళ్లు పెట్టుకున్న అంబటి అర్జున్.. ఆ పనిచేసే షాకిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!!

బిగ్ బాస్ ( Bigg Boss ) హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సీరియల్ నటుడు అంబటి అర్జున్ అందరికీ తెలిసే ఉంటారు.

ఈయన అగ్నిసాక్షి సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు.

అలాగే నీతోనే డాన్స్ షోలో కూడా ఈయన భార్యతో కలిసి పాల్గొన్నారు.అయితే అలాంటి అర్జున్ (Ambati Arjun) కి తాజాగా బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు.

ఫ్యామిలీ వీక్ కావడంతో ఇప్పటికే శివాజీ కొడుకు డాక్టర్ గా వచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశారు.అయితే తాజాగా అంబటి అర్జున్ వైఫ్ సురేఖ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

హౌస్ లోకి సురేఖ ఎంట్రీ ఇవ్వడంతోనే అంబటి అర్జున్ ఆనందంతో పొంగిపోయారు.ఇక వెంటనే ఆమెను హత్తుకొని ఓ దగ్గర కూర్చోబెట్టి ఇద్దరు మాట్లాడుకున్నారు.

Advertisement

ఇక సురేఖ (Surekha) తన భర్త గురించి మాట్లాడుతూ నీ ఎమోషన్స్ అన్ని బయటపెట్టు లోపల దాచుకోకు అన్నింటికి రియాక్ట్ అవ్వు అని చెప్పింది.అలాగే తన భర్తకి ప్రేమతో అన్నం తినిపించింది.

ఇక ఇది చూసిన వెంటనే శివాజీ దిస్ ఇస్ ద లైఫ్ దిస్ ఇస్ ఓన్లీ లైఫ్ అంటూ చెప్పారు.ఇక వీరిద్దరి చూసి అక్కడున్న హౌస్ లోని కంటెస్టెంట్లు అందరూ ఎమోషనల్ అయ్యారు.

ఇక అంబటి అర్జున్ సురేఖ ఇద్దరు టేబుల్ మీద కూర్చుంటే మిగతా కంటెస్టెంట్లు అందరూ అక్కడే నిలబడ్డారు.

ఇక సురేఖ ప్రెగ్నెంట్ కావడంతో తన ప్రెగ్నెన్సీ విషయాలు భర్తతో పంచుకుంది.రాత్రి బేబీ పడుకొనివ్వడం లేదు అని చెప్పడంతో అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) ఒక ప్లేట్లో గాజులు, పండ్లు పెట్టి ఆమెకు అందజేస్తాడు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ఇక అది గమనించిన అక్కడే ఉన్న లేడీ కంటెస్టెంట్లు ఒక చీర తీసుకువచ్చి హౌస్ లోనే సురేఖకు సీమంతం చేశారు.ఇక ఇది చూసి సురేఖ చాలా సర్ప్రైజ్ అయింది.

Advertisement

అంతేకాదు ఎమోషనల్ కూడా అయ్యారు.అలా హౌస్ లోనే అంబటి అర్జున్ భార్య సురేఖకి బొట్టు,గంధం,పూలు,పండ్లు,చీర పెట్టి సీమంతం చేశారు.ఇక చివరిగా అర్జున్ మరోసారి తన భార్యని హగ్ చేసుకున్నారు.

ఇక ఈ జంట చుట్టూ చేరి హౌస్లోని కంటెస్టెంట్లు అందరూ పాటలు పాడారు.ఇలా బిగ్ బాస్ హౌస్ లో సురేఖ కి శ్రీమంతం చేసి అంబటి అర్జెంట్ ని సర్ప్రైజ్ చేశారు కంటెస్టెంట్స్.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు