ఈ ఆయిల్‌ను వాడితే హెయిర్ ఫాల్‌, వైట్ హెయిర్ స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు!

ప్ర‌స్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని క‌ల‌వ‌ర పెట్టే జుట్టు స‌మ‌స్య‌ల్లో హెయిర్ ఫాల్‌, వైట్ హెయిర్ వంటివి ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

ఆ స‌మ‌స్య‌ల‌ను నివారించుకోవ‌డం కోసం ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌న్నీ ప్ర‌య‌త్నిస్తుంటారు.

జుట్టుపై చేయాల్సిన ప్ర‌యోగాల‌న్నీ చేస్తారు.అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక తెగ మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆయిల్‌ను వాడితే గ‌నుక హెయిర్ ఫాల్‌, వైట్ హెయిర్ స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.మ‌రి ఇంకెందుకు లేటు ఆ ఆయిల్ ఏంటో.

ఎలా త‌యారు చేసుకోవాలో.చూసేయండి.

Advertisement

ముందుగా ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని తొక్క తొల‌గించి.ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే అంగుళం అల్లం ముక్కను పీల్ తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని ఒక గ్లాస్ కొబ్బ‌రి నూనెను పోయాలి.

నూనె కాస్త హీట్ అవ్వ‌గానే అందులో క‌ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం ముక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ ల‌వంగాలు, నాలుగు ఎండిన ఆరెంజ్ తొక్క‌లు వేసి చిన్న మంట‌పై ప‌ది నుండి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఆయిల్‌ను చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక‌.అప్పుడు స్టైన‌ర్ సాయంతో ఆయిల్‌ను స‌ప‌రేట్ చేసి ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకోవాలి.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఈ ఆయిల్‌ను రాత్రి నిద్రించ‌డానికి గంట ముందు త‌ల‌కు మ‌రియు జుట్టు మొత్తానికి ప‌ట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

Advertisement

ఇలా వారంలో రెండంటే రెండు సార్లు చేశారంటే. హెయిర్ ఫాల్‌, వైట్ హెయిర్ స‌మ‌స్య‌లు ప‌రార్ అవ్వ‌డ‌మే కాదు మ‌ళ్లీ మ‌ళ్లీ ఇబ్బంది పెట్ట‌కుండా కూడా ఉంటాయి.

తాజా వార్తలు