వంట‌ల్లో ఆవ నూనె వాడితే.. మీ ఆరోగ్యం ప‌దిలం!

వంట‌ల్లో విరి విరిగా ఉప‌యోగించే ఆవాలు.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఎన్నో జ‌బ్బులను నివారించ‌డంలోనూ ఆవాలు ఉప‌యోగ‌ప‌డ‌తారు.అయితే అలాంటి ఆవాల నుంచి తీసిన ఆవ నూనెని వంటల్లో వాడటం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సాధార‌ణంగా చాలా మంది నెల‌కో నూనెను వంట‌ల‌కు ఉప‌యోగిస్తుంటారు.కానీ, అలా కాకుండా ఆవ నూనెను వంటల్లో ఉప‌యోగిస్తే మంచిదంటున్నారు.

ఎందుకంటే, అన్ని నూనెల కంటే ఈ ఆవనూనె స్వచ్చమైనది మ‌రియు ఆరోగ్య‌క‌ర‌మైన‌ది.మ‌రి ఆవ నూనె ఉప‌యోగాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఆవ నూనెను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల.శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించి.

మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.త‌ద్వారా గుండె పోటు, ఇత‌ర గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్ష‌ణి ల‌భిస్తుంది.

అలాగే జీర్ణ శక్తిని పెంచడంలో ఆవ నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అదే స‌మ‌యంలో యాంటీ బాక్టీరియ, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్న ఆవ నూనె ఇన్ఫెక్షన్ల నుంచి జీర్ణవ్యవస్థకు కాపాడుతుంది.ఇక ఆవ నూనెను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ కూడా బ‌ల‌ప‌డుతుంద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇటీవ‌ల కాలంలో చాలా మంది థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధుప‌డుతున్నారు.అలాంటి వారు ఆవ నూనెను వాడ‌డం వ‌ల్ల థైరాయిడ్ త‌గ్గుతుంది.మ‌రియు ఆవ నూనె వాడ‌కం వ‌ల్ల హైపర్‌ థైరాయిడ్‌ రాకుండా కూడా ఉంటుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఆవ నూనెతో త‌యారు చేసిన వంట‌లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు క‌రుగుతుంది.త‌ద్వారా అధిక బ‌రువు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Advertisement

ఇక కిడ్నీ స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలోనూ ఆవె నూనె ఉప‌యోగ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, వంట‌ల్లో ఏవేవో నూనెలు కాకుండా ఆవ నూనె వాడ‌డం మంచిది.

తాజా వార్తలు