ఆరోగ్యానికి అండంగా ఉండే బిర్యానీ ఆకు టీ.. రోజుకో క‌ప్పు తాగితే ఏం జ‌రుగుతుంది?

బే లీఫ్.( Bay Leaf ) మ‌న వాడుక భాష‌లో దీనిని బిర్యానీ ఆకు అని పిలుస్తారు.

బిర్యానీ, పులావ్‌, మ‌సాలా కూర‌ల్లో బిర్యానీ ఆకును విరివిగా ఉప‌యోగిస్తారు.ఆహారం రుచిని పెంచ‌డంతో, ప్ర‌త్యేక‌మైన‌ ఫ్లేవ‌ర్ ను జోడించ‌డంలో బిర్యానీ ఆకుకు మ‌రొక‌టి సాటి లేదు.

అలాగే ఆరోగ్యానికి కూడా బిర్యానీ ఆకు అండంగా ఉంటుంది.విటమిన్ ఎ, విట‌మిన్ సి, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మ‌రియు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ కు బిర్యానీ ఆకు గొప్ప మూలం.

ముఖ్యంగా ఈ ఆకుతో టీ త‌యారు చేసుకుని రోజుకో క‌ప్పు చొప్పున తాగితే మీ శ‌రీరంలో అద్భుతాలు జ‌రుగుతాయి.

Advertisement

బిర్యానీ ఆకు టీ( Bay Leaf Tea ) త‌యారు చేసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌నేమి కాదు.ఒక గ్లాస్ వాట‌ర్ లో రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు, అంగుళం దాల్చిన చెక్క‌( Cinnamon ) వేసి గంట పాటు నాన‌బెట్టుకోవాలి.ఆపై స్ట‌వ్ పై పెట్టి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించి వాట‌ర్ ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

ఈ వాట‌ర్ లో వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం క‌లిపి బిర్యానీ ఆకు టీ రెడీ అవుతుంది.

ఎంతో రుచిక‌రంగా ఉండే ఈ టీ ను రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకుంటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.ప్ర‌ధానంగా బిర్యానీ ఆకు టీ మంచి స్ట్రెస్ బ‌స్ట‌ర్ గా ప‌ని చేస్తుంది.ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటివి ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు ఈ టీ తాగితే క్ష‌ణాల్లో మైండ్ రిలాక్స్ అవుతుంది.

ఒత్తిడి స్థాయిలు త‌గ్గుతాయి.అలాగే వెయిట్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారికి బిర్యానీ ఆకు టీ ఉత్త‌మ ఎంపిక అవుతుంది.

నిజ్జర్ హత్య : ఆధారాలపై చేతులెత్తేసిన ట్రూడో .. భారత్‌దే విజయమన్న కెనడియన్ జర్నలిస్ట్
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచంటే ? 

ఈ టీ జీవక్రియను పెంచుతుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.బిర్యానీ ఆకు టీ గ్లూకోజ్ మరియు లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తాయి.

Advertisement

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తాయి.డ‌యాబెటిస్( Diabetes ) వ‌చ్చే రిస్క్ ను త‌గ్గిస్తాయి.

అంతేకాదు మలబద్ధకాన్ని నివారించడంలో, జీర్ణక్రియ ప‌నితీరును పెంచ‌డంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.బిర్యానీ ఆకులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మ‌న శరీరాన్ని ఇన్‌ఫ్లమేషన్ నుండి రక్షిస్తాయి.

తాజా వార్తలు