మెంతులు, కలబంద.. ఈ రెండు ఉంటే చాలు ఎలాంటి జుట్టు సమస్యలకైనా చెక్ పెట్టవచ్చు!

జుట్టు ఆరోగ్యానికి సహాయపడే వాటిలో మెంతులు( Fenugreeks ) కలబంద ముందు వరుసలో ఉంటాయి.

ఈ రెండు ఉంటే చాలు ఎలాంటి జుట్టు సమస్యలకైనా సులభంగా చెక్ పెట్టవచ్చు.

మెంతుల్లో ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.అలాగే అలోవెరా లో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి మెండుగా నిండి ఉంటాయి.

ఇవి జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి.అనేక జుట్టు సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.

మెంతులు మరియు కలబందను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా సరే పరార్ అవ్వాల్సిందే.

Advertisement

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలి.అలాగే ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఒక కలబంద ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న మెంతులతో పాటు క‌ట్ చేసి పెట్టుకున్న కలబంద( Aloe vera ) ముక్కలు కూడా వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.హెయిర్ గ్రోత్ ( Hair growth )ఇంప్రూవ్ అవుతుంది.త‌ల‌లో దురద, చికాకు దూరం అవుతాయి.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

చుండ్రు( Dandruff ) మాయం అవుతుంది.స్కాల్ప్ హెల్తీ గా మారుతుంది.

Advertisement

జుట్టు నుంచి చెడు వాసన రాకుండా ఉంటుంది.స్కాల్ప్ పై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.

కుదుళ్లు దృఢంగా మారతాయి.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మరియు జుట్టు చిట్లడం సైతం ఆగుతుంది.ఫైనల్ గా మెంతులు కలబంద తో హెల్తీ హెయిర్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు