అల్లువారి అబ్బాయి ఎక్కడ?

మెగా స్టైలిష్‌స్టార్‌ అల్లు తమ్ముడు అల్లు శిరీష్‌ ‘కొత్త జంట’ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ‘కొత్త జంట’ విడుదలై చాలా కాలం అయినా ఇప్పటి వరకు ఈయన తన తర్వాత సినిమాను ప్రకటించింది లేదు.

పవన్‌ సాదినేని దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.ఆ తర్వాత పలువురు దర్శకులతో ఈ సినిమా తన తర్వాత సినిమా చేయబోతున్నాడు అంటూ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే ఇప్పటికి కూడా ఈయన ఏ సినిమాలో, ఎవరి దర్శకత్వంలో నటించబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు.ఆ మద్య ‘సోలో’ ఫేం పరుశురామ్‌ దర్శకత్వంలో అల్లు శిరీష్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

పరుశురామ్‌ కూడా తాను అల్లు శిరీష్‌కు ఒక కథ వినిపించడం జరిగిందని, ఆ కథకు ఆయన ఓకే చెప్పాడని చెప్పుకొచ్చాడు.అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడని కూడా ప్రచారం జరిగింది.

Advertisement

పరుశురామ్‌ చెప్పిన కథలో నటించేందుకు అల్లు శిరీష్‌ బాడీని పెంచే పనిలో ఉన్నాడని కూడా ప్రచారం జరిగింది.అయితే ఈయన సినిమా ఎప్పుడు ప్రారంభం అనేది మాత్రం తెలియరావడం లేదు.

ఇతర మెగా హీరోలు వరుస సినిమాలో దూసుకు పోతుంటే ఈయన మాత్రం నత్తడకన కెరీర్‌ను సాగిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు