అల్లు అర్జున్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్పఅనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమా పై భారీ అంచనాలను పెంచాయి.ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్అనే సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా గురించి అల్లు అర్జున్ తో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తుంది.

ఐకాన్ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించడం కోసం హీరోయిన్ల వేటలో పడ్డారు దర్శక నిర్మాతలు.

Advertisement

ఇందులో అల్లు అర్జున్ సరసన నటించడం కోసం కియారా అద్వానీ పేరు వినిపించడంతో పాటు, అలియా భట్ నటించబోతుందన్న సమాచారం వినపడుతోంది.తాజాగా అల్లు అర్జున్ సరసన ఐకాన్ సినిమాలో నటించడం కోసం హీరోయిన్ అనన్య పాండే, జాన్వికపూర్ పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే ఈ ఇద్దరిలో అల్లు అర్జున్ ఎవరితో ఐకాన్ సినిమా చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ ఈ సినిమా పూర్తి కాగానే ఐకాన్ సినిమాలో బిజీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు