Allu Arjun : నీళ్లలో మునిగిపోయిన సుకుమార్ ప్రాణాలు కాపాడి అలాంటి మాట తీసుకున్న అల్లు అర్జున్.. ఏంటంటే..?

రాఘవేంద్రరావు (Raghavendra Rao) వందవ సినిమా గా వచ్చిన గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ ని హీరోగా తీసుకొని అల్లునిర్మలకి రాఘవేంద్రరావు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

ఎందుకంటే చిన్నప్పుడే అల్లు అర్జున్ (Allu Arjun) డాన్స్ చూసిన రాఘవేంద్రరావు తన కొడుకుని హీరోగా నేనే పరిచయం చేస్తానని అల్లు నిర్మలకు చెప్పారట.

ఇక ఆయన చెప్పినట్లుగానే అల్లు అర్జున్ పెద్దయ్యాక తన మొదటి సినిమాకి దర్శకత్వం రాఘవేంద్రరావు వహించారు.అయితే ఈ సినిమా 54 సెంటర్లలో వంద రోజులు ఆడి సూపర్ హిట్ అయినప్పటికీ అల్లు అర్జున్ లుక్స్ పై మాత్రం తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి.

అంతేకాదు చిరంజీవి మేనల్లుడు స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు అయితే హీరో అయిపోతారా అంటూ ఎద్దెవా చేశారట.కానీ గంగోత్రి (Gangothri) సినిమా విడుదలైన వందరోజుల ఫంక్షన్ లోపు అల్లు అర్జున్ పూర్తిగా తన లుక్ ని మార్చేసుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పింది.ఈ సినిమాతో అల్లు అర్జున్ తన నటనని బయటపెట్టి ఫీల్ మై లవ్ అనే సాంగ్ తో అప్పటి యూత్ ని ఎంతగానో ఆకర్షించారు.

Advertisement

ఇక ఆర్య (Aarya) సినిమా అప్పట్లో ఎంతోమంది యువతను ఆకట్టుకొని వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పారు.అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా సుకుమార్ కి ఒక అపశృతి ఎదురైందట.అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ తో బోట్ సీన్ తెరకెక్కించే సమయంలో హీరోయిన్ బోట్ నుండి జంప్ చేయడంతో అందులో ఉన్న డైరెక్టర్ సుకుమార్ నీళ్లలో పడిపోయారట.

కానీ ఆ సమయానికి సుకుమార్ కి ఈత రాక ప్రాణాపాయం లో చిక్కుకున్నారట.

ఇక అక్కడే ఉన్న వాళ్ళందరూ సుకుమార్ ఏమైపోతారో అనే షాక్ లో అలాగే చూస్తూ ఉంటే అల్లు అర్జున్ (Allu arjun) మాత్రం తన ప్రాణాలకు తెగించి సుకుమార్ ని కాపాడారట.ఇక తన ప్రాణాలను అడ్డేసి అల్లు అర్జున్ తనని కాపాడడంతో సుకుమార్ అల్లుఅర్జున్ కి థాంక్స్ చెబితే నాకు మీ థాంక్స్ ఏమీ వద్దు కానీ నాకు ఒక ప్రామిస్ చేయండి అని సుకుమార్ (Sukumar) దగ్గర మాట తీసుకున్నారట.ఇక అదేంటంటే.

నేను చేసే ఏడు సినిమాలకు మీరే కథ రాయాలి అని చెప్పారట.ఇలా అల్లు అర్జున్ కి సినిమాలంటే అంత పిచ్చి అని సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు