తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.ఇటీవల దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
కాగా ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, నటుడు సత్యదేవ్ లు కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతోపాటు ఊహించిన దానికంటే అత్యధిక కలెక్షన్లను సాధిస్తూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.దీంతో ఇటీవలే ఈ చిత్రం బృందం సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.
అనుకున్న దాని కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించి మంచి హిట్ అవ్వడంతో చిత్రం బృందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాను.
ఇకపోతే దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా సక్సెస్ అయినందుకు పలువురు సెలబ్రిటీలు ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మోహన్ రాజా మాట్లాడుతూ నాకు మొదట రామ్‌చరణ్ ఫోన్ చేశారు.అంతేకాక ఉదయం ఆరు గంటలకే నా దగ్గరకు వచ్చి అరగంటసేపు మాట్లాడారు.ఆ సమయంలో నాకు ఇది చాలు అనిపించింది.
ఆ తరువాత అల్లు అర్జున్ కూడా ఈ సినిమాని చూసి 21 నిమిషాలు నాతో మాట్లాడారు.అని చెప్పుకొచ్చారు మోహన్ రాజా.
పిచ్చెక్కించేశారు.సినిమా లడ్డూలా ఉందన్నారు అని తెలిపారు మొహన్ రాజా.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ అయితే ఏకంగా ఆఫీస్‌కే వచ్చేసి అభినందించారు.అని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా.