ఈ భూమి మీద మనిషి పుట్టుక చావు రెండు కలిసే ఉంటాయి.అందుకే ఈ చావును భూమి మీద పుట్టిన ఏ ఒక్క మనిషి కూడా తప్పించుకోలేడు.
ఇది మనం పుట్టినప్పుడే నిర్ణయించబడ్డ దైవ నిర్ణయం.భగవద్గీత ప్రాచీన భారతంలో మరణం, మరణానం తర్వాత జీవితం, పునర్జన్మలపై ఎన్నో నమ్మకాలు ఉన్నాయి.
మరణించిన వ్యక్తి ఏదో ఒక జీవి రూపంలో తిరిగి పునర్జన్మ ఎత్తుతాడనే నమ్మకంతో ఎంతో మంది ప్రజలు నమ్మకంతో ఉన్నారు.మరికొంతమంది మరణానంతర శరీరం మాత్రమే చనిపోతుందని, ఆత్మ సంచరిస్తుందని కూడా నమ్ముతారు.
అయితే మరణాంతరం జీవితంపై శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కాస్మోలజిస్ట్,సీన్ కారోల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి మనిషి మరణాంతరం జీవితంపై పరిశోధనలు కూడా చేస్తున్నారు.సీన్ కారోల్ యూకే లోని ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో మరణానంతర జీవితంపై కొన్ని ఆసక్తికర నిజాలు తెలిపారు.
మరణానంతరం జీవితం ఉంటుందనే విషయం పూర్తిగా అబద్దమని చెప్పినా ఆయన,సైన్స్ కొత్త మందులు, విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్ వంటి ఎన్నో టెక్నాలజీ సంబంధిత బహుమతులను సృష్టించింది.
కానీ మరణానంతరం జీవితం ఉందని మాత్రం సైన్సు చెప్పడం లేదని సీన్ కారోల్ అన్నారు.మరణానంతరం జీవితం ఉండాలంటే మన భౌతిక శరీరం నుంచి స్పృహ అనేదాన్ని పూర్తిగా వేరుచేయాలి అని సీన్ కారోల్ తెలిపారు .మన శరీరాలు భౌతికంగా మరణించినా, వాటి పరమాణువుల్లో ఏదో ఒక రకమైన స్పృహ కొనసాగుతుందనే వాదనలు కూడా భారీగా ఉన్నాయి.అయితే రోజువారీగా మన జీవితంలో అంతర్గతంగా ఉన్న భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం మనం చనిపోయాక కూడా మన మెదడులో నిల్వ ఉన్న సమాచారాన్ని కొనసాగించేందుకు ఎటువంటి మార్గం లేదు.అంటే సైన్సు ప్రకారం మరణానంతర జీవితం అసాధ్యమని సీన్ కారోల్ చెప్పారు.