ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”పుష్ప ది రూల్”( Pushpa the Rule ).రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మన పుష్ప రాజ్ రాకకోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చేంసింది అనే చెప్పాలి.
అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.ఈ అప్డేట్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా అంచనాలు డబల్ అయ్యాయి.”పుష్ప ది రైజ్” సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుండగా చిత్ర యూనిట్ కు బిగ్ షాకింగ్ న్యూస్ ఎదురైనట్టు టాక్.ఈ చిత్ర యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్( Bus Accident ) కు గురి అయినట్టు సమాచారం అందుతుంది. విజయవాడ – హైదరాబాద్ హైవే మీద పుష్ప 2 ఆర్టిస్టులతో ప్రైవేట్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీ కొట్టినట్టు సమాచారం.
మరి ఈ ఘటన నార్కెట్ పల్లి దగ్గర జరిగినట్టు తెలుస్తుంది.అయితే ఈ ప్రమాదంలో ఇద్దరి ఆర్టిస్టులకు గాయాలు అయ్యాయని తెలుస్తుంది.దీంతో ఆర్టిస్టులు గాయాలతోనే బయట పడడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్( Fahadh Faasil ) విలన్ రోల్ లో నటిస్తుండగా ఈసారి మరింత భారీ తారాగణం ను సుకుమార్ యాడ్ చేసుకుంటూ పోతున్నాడు.అందుకే ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి.ఈ ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు సుక్కూ సన్నాహాలు చేస్తుండగా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.