ఇక్కడ అల్లు అర్జున్.. అక్కడ పునీత్.. ఆ విషయంలో ఇద్దరు నెంబర్ 1?

కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా నిలిచిన పునీత్ రాజ్ కుమార్ మరణించాడన్న వార్త తెలియడంతో ఎంతోమంది అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ కు గురయ్యారు.

కేవలం కన్నడ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఈయనకు మంచి అభిమానం ఉంది.

ఇక ప్రస్తుతం ఈయన గురించి సోషల్ మీడియాలో, వార్తలలో ఎన్నో విషయాలు ప్రసారమవుతున్నాయి.ఇదిలా ఉంటే ఓ విషయంలో అల్లు అర్జున్ తో సమానంగా ఉన్నాడు పునీత్.

ఇంతకు అది ఏంటో తెలుసుకుందాం.తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పునీత్ రాజ్ కుమార్ బాల నటుడుగా పరిచయమయ్యాడు.

అలా చిన్న వయసులోనే పలు సినిమాలలో నటించి తన నటనకు అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత హీరోగా పరిచయమై ఎన్నో సినిమాలలో నటించాడు.

Advertisement

అతి తక్కువ సమయంలో కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా మారాడు.ఇక ఈయనకు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు.

నటుడుగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అనుబంధం ఉంది.

టాలీవుడ్ స్టార్ నటులతో కూడా మంచి పరిచయాన్ని పెంచుకున్నాడు.టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈయన డబ్బింగ్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు.

ఇక్కడ అభిమానుల హృదయాలను కూడా సంపాదించుకున్నాడు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు పునీత్.తన సంబంధించిన ఫోటోలను, వర్క్ అవుట్ ల వీడియోలను బాగా పంచుకుంటాడు.అలా ఈయన జిమ్ లో చేసే వర్కౌట్ లు వీడియోలు చూస్తే మాత్రం మతి పోతుంది.

Advertisement

ఎందుకంటే చాలా కష్టమైన వర్కౌట్లు చేస్తూ ఉంటాడు.అలా రోజూ చేసే విధంగా నిన్న కూడా జిమ్ లో హెవీ వర్క్ అవుట్ చేస్తుండగా అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మరణించాడు.ఈయన హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిన వెంటనే ఎంతోమంది అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు.కానీ మరణించాడని తెలియటంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇక ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈయనకు టాలీవుడ్ హీరోలతో కూడా పరిచయం ఉండటంతో వాళ్ల తో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.కాకుండా ఆయన అల్లు అర్జున్ తో గతంలో దిగిన ఫోటో కూడా ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ గా మారింది.వీరిద్దరిలో కొన్ని విషయాలు చాలా వరకు సమానంగా ఉన్నాయి అంటూ అభిమానులు తెలుపుతున్నారు.

తాజా వార్తలు