రామ్‌ చరణ్ డేట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న అల్లు అరవింద్‌.. ఆ మల్టీస్టారర్‌ కోసమా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా అల్లు అరవింద్ నిర్మాణం లో గతం లో మగధీర సినిమా వచ్చింది.

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అప్పటి నుండి రామ్ చరణ్ హీరో గా అల్లు అరవింద్ నిర్మాణం లో సినిమా రానే రాలేదు.అందుకే అల్లు వారు ఇప్పుడు రామ్ చరణ్ హీరో గా ఒక సినిమా ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడుతూ రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ హీరో లుగా ఒక మల్టీ స్టార్ సినిమా ను చేయాలని ఆశ పడుతున్నట్లుగా పేర్కొన్నాడు.

అందుకోసం ఒక టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించి పెట్టానని, దాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయిస్తున్నానని కూడా అల్లు అరవింద్ పేర్కొన్నాడు.తాజాగా అల్లు అరవింద్ డేట్లు కావాలంటూ రామ్‌ చరణ్ అడిగిన నేపథ్యం లో మల్టీ స్టారర్ సినిమా కోసమా లేదంటే సోలో హీరో గా రామ్‌ చరణ్ తో సినిమా చేయబోతున్నాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.ప్రస్తుతానికైతే శంకర్ దర్శకత్వం లో రామ్ చరణ్ ఒక సినిమా ను చేస్తున్నాడు.

Advertisement

ఆ సినిమా పూర్తి అవ్వడానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తాడు.ఇలా చేసుకుంటూ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల వరకు రామ్ చరణ్ ఖాతాలో ఒక్కొక్కటిగా సినిమా వచ్చి చేరబోతూనే ఉంది.మరి ఎప్పటికి అల్లు అరవింద్ కి రామ్ చరణ్ డేట్ ఇస్తాడు అనేది చూడాలి.

రామ్ చరణ్, అల్లు అరవింద్ కాంబోలో మరో మగధీర రేంజ్ సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు