అల్లు అరవింద్‌, పరశురామ్ గొడవ ఏం అయ్యింది... ఏం జరుగుతోంది!

అల్లు అరవింద్ వద్ద అడ్వాన్స్ తీసుకుని దిల్ రాజు నిర్మాణం లో విజయ్ దేవరకొండ హీరో గా సినిమా ను రూపొందించేందుకు దర్శకుడు పరశురాం సిద్ధం అయిన విషయం తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమా విడుదలైన వెంటనే అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చి పరశురాం ని బుక్ చేసుకున్నాడు.

ఇప్పటికే పరశురాం చెప్పిన స్క్రిప్ట్ ఓకే అవ్వడం తో త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టాలని భావించాడు.ఇంతలోనే విజయ్ దేవరకొండ హీరో గా దిల్ రాజు నిర్మాణం లో పరశురాం సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

దాంతో నిర్మాత అల్లు అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పరశురాం విషయమై తీవ్ర విమర్శలు చేయాలని భావించాడు.కానీ నిర్మాతల మండలి మధ్యవర్తిత్వం తో పరశురాం క్షమాపణలు చెప్పడం తో మీడియా సమావేశం రద్దు చేసుకున్నాడు.

ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం క్లారిటీ లేదు.

Allu Aravind And Parashuram Controversy Issue , Allu Aravind, Flim News, Geeta
Advertisement
Allu Aravind And Parashuram Controversy Issue , Allu Aravind, Flim News, Geeta

దిల్ రాజు నిర్మాణం లోనే పరశురాం యొక్క సినిమా రాబోతుందా లేదంటే అల్లు అరవింద్ బ్యానర్ లో పరుశురాం సినిమా చేసేందుకు ఓకే చెప్పాడా అనేది తెలియాల్సి ఉంది.ఇంత వివాదం జరిగిన తర్వాత మళ్లీ అల్లు అరవింద్ నిర్మాణం లో ఎలా పరశురాం సినిమా చేస్తాడు అనేది పెద్ద డౌట్.మొత్తానికి అల్లు అరవింద్ మరియు పరశురాం యొక్క కాంబినేషన్ మరియు వివాదం ఎక్కడ వరకు వచ్చింది అనేది మీడియా సర్కిల్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ఉందా లేదా అనేది అనుమానంగా మారింది.అల్లు అరవింద్ మరియు పరశురామ్ కాంబో లో గీత గోవిందం సినిమా రావాలని అంతా కోరుకున్నారు.

కానీ ఈ వివాదం తో గీత గోవిదం సీక్వెల్ లేనట్లే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు