బీజేపీ తో పొత్తు ..! 'అభీష్ట ' పైనే టీడీపీ ఆశలు ?

బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) చేయని ప్రయత్నం లేదు.

ఈ పొత్తు విషయంలో బిజెపి అగ్ర నాయకులకు నచ్చజెప్పి, టిడిపి తో పొత్తుకు అంగీకరించే విధంగా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం బిజెపి పెద్దల వద్ద ఈ పొత్తు అంశాన్ని ప్రస్తావించినా, టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కానీ, ప్రధాని నరేంద్ర మోది గాని ఏమాత్రం ఇష్టపడడం లేదు.గతంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా, టిడిపికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు.

ఇక టిడిపి నుంచి బిజెపిలో చేరిన సృజన చౌదరి, సీఎం రమేష్ తో పాటు, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ద్వారా చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు చేసినా, ఆ ప్రయత్నం ఫలించలేదు.

 ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) సైతం ఈ విషయంలో సక్సెస్ కాలేదు అనే అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు బిజెపి అగ్ర నేతల మనసు మార్చేందుకు టిడిపితో పొత్తు కు అంగీకరించేందుకు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు.ఈ మేరకు ఢిల్లీకి చెందిన రాజకీయ వ్యూహకర్త అభిష్టాను నమ్ముకున్నారు.అభిస్టా వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సర్వేలు చేపట్టడంతో పాటు , కేంద్రం కార్మిక ,పర్యావరణ ,అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్( Bhupendra Yadav ) కి సన్నిహితుడుగా పేరు పొందారు.

Advertisement

ఈ వ్యూకర్త ద్వారానే బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఇప్పటికే అభిష్టా ఏపీలో సర్వే నిర్వహించారని , టిడిపితో పొత్తు పెట్టుకుంటేనే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని బిజెపికి నివేదిక ఇచ్చారట.

ఇక ఈ అభిష్ట గురించి చెప్పుకుంటే 2019 ఎన్నికలకు ముందు నుంచి ప్రస్తుత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి పనిచేశారు .

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ,  పార్టీ వ్యవహారాల్లో అన్ని విధాలుగా సహకరిస్తూ లోకేష్ కు ఓ ఎస్ డి గాను అభీష్టా పనిచేశారు.ఇక 2017 డిసెంబర్ లో అభీష్టా ఏపీలో ఉద్యోగాలు వదిలి కేంద్ర  మంత్రి భూపేంద్ర యాదవ్ తో ఢిల్లీలో ఉంటున్నారు గతంలో అభీష్టాతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో బిజెపి అగ్ర నేతలకు దగ్గర అయ్యేందుకు, టిడిపి - బిజెపి మధ్య పొత్తు కుదుర్చేందుకు అభీష్టా ద్వారా లాభియింగ్  చేయాలనే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారట.ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, బిజెపి అగ్రనేతల మనసు ఎప్పుడు మారుతుంది అనేది వేచి చూడాల్సిందే.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు