కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్న అల్లరి నరేష్...

ఒకప్పుడు మంచి కామెడీ సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్న అల్లరి నరేష్( Allari naresh ) ప్రస్తుతం సీరియస్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు.నిజానికి ఆయన చేసిన నాంది సినిమా ( Naandhi Movie )మంచి హిట్ అయింది ఇక అది ఇచ్చిన సక్సెస్ తో ఆ డైరెక్టర్ తోనే మరో సినిమా చేశాడు అదే ఉగ్రమ్ ఈ సినిమా అవరేజ్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అల్లరి నరేష్ చేస్తున్న సినిమాలని చూస్తున్న వాళ్ళు అప్పుడు వరుసగా కామెడీ సినిమాలు చేశావ్ ఇప్పుడు వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్నావ్ అప్పుడు ఇప్పుడు ఒకే తప్పు చేస్తున్నావ్ అంటూ నరేష్ మీద కామెంట్లు చేస్తున్నారు అన్ని రకాల సినిమాలు చేస్తూ అన్ని పాత్రలు చేస్తూ ముందుకు వెళ్లాలి కానీ ఒకే టైప్ ఆఫ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులకి బోరు కొట్టించకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.నిజానికి నరేష్ అప్పట్లో వరుసగా కామెడీ సినిమాలు చేయడం వల్లే ఆయన మూవీస్ అంటేనే జనాలకి బోరు కొట్టేసింది ఇక ఇప్పుడు మళ్లీ ఇలాంటి సినిమాలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి డిఫరెంట్ గా ట్రై చేయాలని నరేష్ కూడా చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

అందులో భాగంగానే మరో కమర్షియల్ సినిమా చేస్తున్నట్టు గా తెలుస్తుంది.నరేష్ కెరియర్ మహేష్ బాబు తో చేసిన మహార్షి సినిమా ( Maharshi movie ) ముందు వరకు కూడా మొత్తం డౌన్ ఫాల్ అయిపోయింది అసలు ఆయన లకి ఛాన్సులు ఇచ్చేవాళ్ళు లేక సిని కెరియర్ ముగిసింది అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా మళ్ళీ ఆయన ట్రాక్ లోకి వచ్చారు.అయితే ప్రస్తుతం కార్తిక్ అనే ఒక కొత్త డైరెక్టర్ తో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో సినిమా చేయనున్నట్టు గా తెలుస్తుంది.

నిజానికి ఈ సినిమా వేరే హీరో చేయాలి కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా నరేష్ వద్దకి వచ్చింది మరి ఈ సినిమా తో నరేష్ కోరుకున్న హిట్ వస్తుందో లేదో చూడాలి.

Advertisement
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

తాజా వార్తలు