'ముందస్తు' వ్యూహం ముంచుతుందా ..? తేల్చుతుందా ..?

ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్న ఏపీ అధికార పార్టీ టిడిపి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టెక్కాలని చూస్తోంది.

ఈ మేరకు ఇప్పటికే అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఎన్నికల నోటిఫికేషన్ కూడా మరికొద్ది రోజుల్లోనే వచ్చేస్తుండడంతో పాటు ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో పార్టీ అభ్యర్థుల ప్రకటన ముందుగానే చేయాలని చూస్తోంది.దీనికి తెలంగాణ లో కెసిఆర్ అనుసరించిన వ్యూహాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చూస్తోంది.

అయితే కేసీఆర్ అక్కడ అనుసరించిన వ్యూహం వర్కౌట్ అవుతుందా .? లేదా అనే సందేహం లో కూడా టిడిపి అధినేత లో కనిపిస్తుంది.

ఇప్పటికే పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ కూడా దాదాపుగా తయారు చేసుకున్నారు అందుకే ఆ లిస్టు ప్రకారం నోటిఫికేషన్ విడుదల కాకముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన బాబు ఉన్నాడు.ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే వారు ముందుగానే ఆయా నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ.ప్రచారం చేసుకుంటారని.

Advertisement

ఇప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతూ.లబ్ది పొందేందుకు వారికి అవకాశం దక్కుతుందని.

అలాగే ఇంకా లోపాలను కూడా సరిదిద్దుకుని కేడర్ ను మరింత బలోపేతం చేయడానికి అవకాశం దక్కుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.

ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే.ప్రత్యర్థి పార్టీలు ఈ అభ్యర్థుల కంటే బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి దూకుడు ప్రదర్శించి తమ అభ్యర్థులను వెనక్కి నెట్టే అవకాశం ఉందని.

బాబు సందేహం పడలేక పడుతున్నాడు.అసలు టిడిపి మొదటి నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసే సమయం వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అనేది ప్రకటించకుండా.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తరువాతే.సామజిక వర్గాల లెక్కలు.

Advertisement

బలమైన అభ్యర్థుల ఎంపిక చేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకునే వారు.

అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.ఏపీలో త్రిముఖ పోరు తీవ్రంగా ఉండే పరిస్థితుల నేపథ్యంలో.ముందస్తుగానే .అభ్యర్థులను రంగంలోకి దించడమే మేలని బాబు ఒక అభిప్రాయానికి వచ్చాడు.అయితే.

ఇప్పటికే వైసీపీ 130 మంది అభ్యర్థుల లిస్ట్ తయారు చేసుకుని రెడీగా ఉంది.జనసేన కూడా ఇప్పుడిప్పుడే ఆ ప్రయత్నాల దిశగా అడుగులు వేస్తోంది.

కాకపోతే ఆ పార్టీలు కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన తరువాతే ప్రకటించాలని చూస్తున్నాయి.

తాజా వార్తలు