పండుగలకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

బుధవారం ఎల్లారెడ్డిపేట ( Yellareddypet )మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి డిపిఓ శేషాద్రి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, తహసిల్దార్లు, ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రెటరీలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా మండలాల్లోని ప్రతి గ్రామం వారిగా  పారిశుద్ధ్య పనులు, ఇంటి పన్ను వసూలు ఇతర అంశాలపై పంచాయతీ సెక్రెటరీ, ప్రత్యేక అధికారి, ఇతర అధికారులతోకలెక్టర్ చర్చించారు.అనంతరం కలెక్టర్( Collector Sandeep Kumar Jha ) మాట్లాడుతూ, బతుకమ్మ దసరా దీపావళి పండుగల సందర్భంగా  ఆయా గ్రామాల్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్లు, ఇన్చార్జిలు ఏమైనా సమస్యలు ఉంటే నేటి నుంచే వాటిని పరిష్కరిస్తూ పండగ నాటికి సరియైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

ఆయా వేడుకల కోసం గ్రామాల్లో ప్రధాన కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.రోజూ గ్రామాల్లో శానిటేషన్ పనులు నిర్వహించాలని, పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండేలా చూడాలని పేర్కోన్నారు.

వీధిలైట్లు వెలిగేలా చూడాలని పేర్కొన్నారు.గ్రామాల్లో రోడ్డు కు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించాలని సూచించారు.

Advertisement

ఆయా గ్రామాల్లో ఇంటి పన్ను క్రమం తప్పకుండా వసూలు చేయాలని పేర్కొన్నారు.ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలిఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? ఇప్పటివరకు ఎన్ని పరిష్కరించారు? ఆయా మండలాల తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు.మూడు మండలాల్లో కలిపి మొత్తం 5,017 దరఖాస్తులు రాగా, ఇప్పటిదాకా 857 పరిష్కరించామని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రానున్న నెల రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు సత్తయ్య, రాజేందర్, రఘురాం, తహసిల్దార్లు రాంచంద్రం, సురేష్, మారుతి రెడ్డి, ఎంపీఓ లు రాజు, బీరయ్య, వాజిద్, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News