అయ్య‌య్యో.. వ‌ధువు ఏదో చేయ‌బోతే ఇంకేదో అయింది.. చూస్తే న‌వ్వులే

పెండ్లి అంటేనే నూరేండ్ల పంట అని అంటారు పెద్ద‌లు.అందుకే ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఈ పండుగ చాలా ముఖ్య‌మైన‌దిగా మారిపోయింది.

ఇప్ప‌టికే ఎంతో మంది పెండ్లిల‌ను ఎంతో స్పెష‌ల్ గా నిర్వ‌హించుకుంటున్నారు.మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టుగా పెండ్లిల‌లో కూడా ఎన్నో మార్పులు వ‌చ్చాయి.

ఒక‌ప్పుడు పెండ్లి అంటే అమ్మాయి సిగ్గుప‌డుతూ కూర్చునేది.కానీ ఇప్పుడు అమ్మాయిలు మాత్రం సిగ్గు ప‌డ‌టం ప‌క్క‌న పెట్టేసి ఎంచ‌క్కా త‌మ పెండ్లిని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇంక ఇటీవ‌ల అయితే డ్యాన్సులు చేస్తున్నారంటే న‌మ్మండి.ఈ మ‌ధ్య‌ పెండ్లిల ద‌గ్గ‌ర ఎలాంటి వీడియోలు వైర‌ల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.

Advertisement

మ‌రీ ఎక్కువ‌గా పెండ్లి మంట‌పాల ద‌గ్గ‌ర దండ‌లు మార్చుకునే క్ర‌మంలో లేదంటే బ‌ర‌త్‌లో ఏదో ఒక ఫ‌న్నీ మూమెంట్ జ‌ర‌గ‌డం అదికాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఘ‌ట‌న‌లు మ‌నం అనేకం చూస్తూనే ఉన్నాం.ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

దాన్ని చూస్తే నిజంగానే న‌వ్వు వ‌చ్చేస్తుంది.ఇందులో దండ‌లు మార్చుకునే స‌మ‌యంలో వధువు స‌ర‌దాగా వ‌రుడిని ఆట ప‌ట్టించేందుకు రెడీ అవుతుంది.

వ‌రుడికి వధువు చాలా స్పీడుగా దండ‌ను అత‌ని మెడ‌లోకి విసిరేయడం మ‌నం ఈ వైర‌ల్ వీడియోలో చూడొచ్చు.ఇక వ‌రుడి వంతు వ‌చ్చిన‌ప్పుడు ఎలాగైనా త‌ప్పించుకునేందుకు ఎక్కువగా రెస్పాండ్ అయ్యింది ఆ న‌వ వ‌ధువు.కాగా ఈ హడావుడిలో కొంచెం ఓవ‌ర్ గా క‌ద‌ల‌డంలో చివ‌ర‌కు బ్యాలెన్స్ తప్పి ఇంద ప‌డిపోయింది.

ఇంక దీన్ని చూసిన బంధువులు వెంట‌నే ఆమెనే పైకి లేపేందుకు ప్ర‌య‌త్నించ‌డం క‌నిపిస్తుంది.మొత్తానికి ఈ విధంగా వ‌ధువు స‌ర‌దాగా చేసిన ప్ర‌త‌య్నం కాస్తా న‌వ్వులు పూయించింద‌న్న‌మాట‌.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మ‌రి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు