కొత్త లుక్ లో దర్శనమిచ్చిన అఖిల్... తమిళ్ డైరెక్టర్ తో చేయబోయే సినిమా కోసమేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ( Akhil ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున చిన్న కొడుకు అయిన అఖిల్ కూడా ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆయనకి సరైన సక్సెస్ అయితే రాలేదు.ఇక గత సంవత్సరం వచ్చిన ఏజెంట్ సినిమా( Agent movie )తో సూపర్ సక్సెస్ ని అందుకుంటాడు అని అందరూ అనుకున్నారు.

కానీ ఆ సినిమా కూడా అందరికీ షాక్ ఇస్తూ డిజాస్టర్ గా మారడంతో ఇక అఖిల్ తన కెరీర్ లో హిట్టు కొట్టలేడు అంటూ అందరూ ఒక స్థాయి నమ్మకానికైతే వచ్చేసారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు కొత్త లుక్ లో దర్శనమిచ్చి ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చాడు.ఇక తను ఎయిర్ పోర్ట్ లో కర్ లో నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

అయితే ఈయన కనిపించిన లుక్ తన తర్వాత సినిమా కోసమే అని తెలుస్తుంది.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement

అయితే ఆయన ఎవరు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.కానీ ప్రస్తుతం తమిళ్ సినిమా డైరెక్టర్ తో సినిమా చేయడానికి తను రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నారట.

ఇక దాని కోసమే తను పొడవాటి జుట్టును కూడా పెంచుతూ చాలా కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తను ఇప్పటికైనా ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు