ఏజెంట్ vs పిఎస్ 2 రెండింటిలో ఏ సినిమా సక్సెస్ అయింది అంటే..?

శుక్రవారం వచ్చింది అంటే చాలు సినిమా అభిమానులకి పండగే ఎందుకంటే ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతు ఉంటాయి.

అలాగే ఈరోజు కూడా అక్కినేని అఖిల్( Akkineni Akhil ) నటించిన ఏజెంట్ సినిమా( Agent Movie ) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అలాగే దానితో పాటుగా మణిరత్నం ( Maniratnam ) తెరెకెక్కించిన పీఎస్ -2( Ponniyin Selvan 2 ) కూడా నేడు విడుదల అయింది.ఈ రెండు సినిమాల్లో ఆడియెన్స్ ని మెప్పించిన చిత్రం ఏది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది .ఏజెంట్ సినిమాని ఏ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించగా.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు .రా ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమాగా చిత్రాన్ని తెర‌కెక్కించారు .

ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని సినిమా చూస్తే త‌ప్ప‌క అర్ధ‌మ‌వుతుంది.యాక్ష‌న్ సన్నివేశాల‌లో అద‌ర‌గొట్టాడు.భారీ ఖ‌ర్చుతో ఏజెంట్ సినిమాని తెర‌కెక్కించ‌గా, ఈ సినిమాకు చేసిన ఖర్చు ప్రతి ఫ్రెములో కనిపిస్తుంది.

హై వోల్టేజ్ సీన్ తో సినిమా ఆకట్టుకుంది .మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో అఖిల్‌కు ఎదురైన సవాళ్లు , ఆ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ బాగుంటాయి .స్పై యాక్షన్‌ ఫిల్మ్స్‌ లో ఉండవలసిన గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్ ప్రేక్ష‌కుల‌ని చాలావరకు ఆకట్టుకుంది .ఇక స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ రెండో భాగం కూడా నేడే ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

Advertisement

సినిమా కధ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉండటంతో ఆసక్తికరంగా సాగిందని పేర్కొంటున్నారు.అరుళ్మోజి మరణవార్త తెలుసుకున్న కరికాలన్ ఏం చేశారు.నందిని చోళరాజ్యాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేయాలనుకుంటుంది.

మాజీ ప్రియుడు కరికాలడిని ఆమె ఎందుకు చంపాలనుకుంటుంది.అరుళ్మోజి, వల్లవరాయన్ ఏమయ్యారు.

వాళ్ళను ఎవరు కాపాడారు.వంటి ఆసక్తికర అంశాలని చూపించిన విధానం బాగుంది అంటున్నారు .అయితే ఇక్కడ తమిళ నేటివిటీ ఎక్కువ అయింది అంటున్నారు.ఇంకాస్త బాగా తీసే వీలున్న మణిరత్నం కొని అంశాలు అసంతృప్తిగా వదిలేశారని అంటున్నారు .తెలుగు ఆడియెన్స్ మాత్రం ఏజెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు .

ఎంవీవీ బీజేపీ వైపు చూస్తున్నారా ? అందుకే పోటీ నుంచి తప్పుకున్నారా ? 
Advertisement

తాజా వార్తలు