ఏకే 62 సినిమాలో ఆ హీరోయిన్ ఫైనల్.. ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని కాదని?

తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అజిత్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుభాషితమే.

 Ak 62 Keerthy Suresh Being Considered Ajith Kumar Next Movie, Ajith , Keerthy Su-TeluguStop.com

అజిత్ తాజాగా నటించిన చిత్రం తుణివు.ఈ సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11వ తేదీన విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు అజిత్.

Telugu Ajith, Ishwarya, Keerthy Suresh, Kollywood, Sai Pallavi, Trisha-Movie

ఇకపోతే అజిత్ నటిస్తున్న తన 62వ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ వహించనున్నారు.మైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోంది.ఈ సినిమాను రేపు నెల అనగా ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఊహగానాలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా అజిత్ తదుపరి సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో అయితే పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.

ఇప్పటికే అజిత్ సరసన నటించే హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి.

Telugu Ajith, Ishwarya, Keerthy Suresh, Kollywood, Sai Pallavi, Trisha-Movie

ముందుగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.ఆ తరువాత నయనతార కాదు త్రిష అంటూ కూడా వార్తలు వినిపించాయి.అంతేకాకుండా నటి ఐశ్వర్యరాయ్ అలాగే సాయి పల్లవి ల పేర్లు కూడా వినిపించాయి.

అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీరందరూ కాదు మరొక టాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ కీర్తి సురేష్.

అయితే అజిత్ తదుపరి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఇందులో ఒకరు ఐశ్వర్యారాయ్ కాగా మరొకరు కీర్తి సురేష్ ఎంపిక చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కనుక నిజమైతే కీర్తి సురేష్ పంట పండినట్లే అని చెప్పవచ్చు.ఎందుకంటే ఇప్పటికే ఆమె రజినీకాంత్ విజయ్, సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.కాగా ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో కీర్తి అజిత్ కు జంటగా నటించాలనే కోరిక ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube