పాన్ మసాలా యాడ్ పై స్పందించిన అజయ్ దేవగన్.. హానికరం అయితే ఎందుకు అమ్మాలి?

బాలీవుడ్ స్టార్ హీరోస్ అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ వంటి సెలబ్రెటీలు నటించిన కమర్షియల్ పాన్ మసాలా యాడ్ ప్రస్తుతం పలు వివాదాలను ఎదుర్కొంటుంది.ఇలా హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఎంతో మంది నెటిజన్లు యాడ్ పై తీవ్ర వ్యతిరేకత చూపించారు.

 Ajay Devgan Responds To Pan Masala Ad By Saying If It Is Harmful Then Why Sell I-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ యాడ్ కి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని హీరో అక్షయ్ కుమార్ ఇకపై తాను ఇలాంటి యాడ్స్ లో నటించనని బహిరంగంగా అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

తాజాగా ఈ వివాదంపై మరొక హీరో అజయ్ దేవగన్ స్పందించి పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఒక ప్రకటనకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వారి వ్యక్తిగత విషయం.వారికి నచ్చితే చేస్తారు లేదంటే మానుకుంటారు.

అయితే కొన్ని ఉత్పత్తులు హానికరం కావచ్చు మరికొన్ని హానికరం కాకపోవచ్చు.కానీ ఇంతకన్నా ఎన్నో హానికరమైన ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి అంటూ అజయ్ దేవగన్ ఈ వివాదంపై స్పందించారు.

అయితే ఆ హానికరమైన ఉత్పత్తుల గురించి నేను మాట్లాడను.ఎందుకంటే వాటిని మరి నేను ప్రమోట్ చేయలేను అంటూ అజయ్ దేవగన్ వెల్లడించారు.ప్రకటనలు నా దృష్టిలో పెద్ద విషయం కాదు.ఒకవేళ ఆ ఉత్పత్తులు హానికరం అయితే వాటిని ఎందుకు అమ్మాలి? ప్రజలు వాటిని ఎందుకు కొనాలి?ఈ విధంగా హానికరమైన ఉత్పత్తులను ఎందుకు అమ్ముతున్నారు? అంటూ వారిని ప్రశ్నించాలని అజయ్ దేవగన్ ఈ సందర్భంగా ఈ పాన్ మసాలా యాడ్ పై స్పందించారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఈ యాడ్ పై మరొక హీరో షారుక్ ఖాన్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube