సరికొత్త రికార్డును సృష్టించిన పుష్ప శ్రీవల్లి సాంగ్... గ్లోబల్ టాప్ నెం.1గా ట్రెండ్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది.

 Pushpa Srivalli Song That Created A New Record Trend As Global Top No 1 , Tollyw-TeluguStop.com

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి తిరుగులేదని చెప్పాలి.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ పుష్ప రికార్డును చెరపలేదు.

ఇక ఈ సినిమాలోని డైలాగులు పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో పాటలు మిలియన్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేశాయని చెప్పాలి.

ఇలా పుష్ప సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది.ఇక ఈ సినిమాలో సమంత నటించిన ఐటమ్ సాంగ్ ఉ అంటావా మామ ఊ…ఊ అంటావా మామ అనే పాటకివచ్చిన క్రేజ్ మామూలుగా లేదు.

ఇక ఈ పాటతో పాటు రష్మిక నటించిన శ్రీ వల్లి అనే సాంగ్ కూడా సరికొత్త రికార్డులను సృష్టించి ప్రేక్షకులను సందడి చేసింది.ఇదిలా ఉండగా తాజాగా శ్రీవల్లి పాట మరొక రికార్డును కైవసం చేసుకుంది.

Telugu Allu Arjun, Pushpa, Rashmika, Srivalli, Telugu, Tollywood-Movie

తాజాగా హిందీ వర్షన్ శ్రీవల్లి పాట య్యూటూబ్ లో 400 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించుకున్న ఈ పాట గ్లోబల్ టాప్ నెం.1 మ్యూజిక్ వీడియోగా ట్రెండింగ్ లో నిలిచింది.తెలుగు సినిమా నుంచి వచ్చిన పాటలో ఈ పాటకి ఇంత క్రేజ్ దక్కిందని చెప్పాలి.ఇక ఈ పాటను లిరిసిస్ట్ చంద్రబోస్ అద్భుతమై లిరిక్స్ అందించగా దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన ట్యూన్ అందించారు.మొత్తానికి శ్రీవల్లి పాట గ్లోబల్ టాప్ నెం.1 గా ట్రెండ్ అవడంతో ఇటు చిత్రబృందం అలాగే బన్నీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube